Street Dog Bites Actor: నటుడిపై కుక్క దాడి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:44 PM
ఆ కుక్క అలానే కోపంగా అరుస్తూ ఉండటంతో ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది. దాన్ని చెప్పుతో కొట్టి అక్కడినుంచి తరిమేశాడు. కుక్క కరిచినా కూడా రాధా కృష్ణన్ నాటకం ఆపలేదు.
ఓ నటుడికి వింత అనుభవం ఎదురైంది. రేబీస్ వ్యాధి అవగాహన కార్యక్రమంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ కుక్క ఆయన్ని కరిచింది. ఈ మొత్తం స్టోరీ వెంటే సినిమాటిక్ ట్రాజెడీలాగా అనిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం కేరళ, కండక్కయ్‌లోని కండక్కయ్ కృష్ణ పిల్లై లైబ్రరీలో రేబీస్ వ్యాధి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వన్ యాక్ట్ ప్లే ఏర్పాటు చేశారు.
57 ఏళ్ల రాధా కృష్ణన్ వన్ యాక్ట్ ప్లే చేస్తూ ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ సౌండ్ స్పీకర్ నుంచి కుక్క అరుపులు వినపిస్తూ ఉన్నాయి. రాధా కృష్ణన్ ఎంతో అద్భుతంగా నటిస్తూ ఉన్నారు. జనాలు ఆయన నటనకు ముగ్ధులై చప్పుట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంతలో అనుకోని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ కుక్క పరుగున రాధా కృష్ణన్ దగ్గరకు వచ్చింది. ఆయన పిక్కపై కరిచింది. గట్టిగా అరుస్తూ మళ్లీ కరవడానికి సిద్ధమైంది.
ప్రేక్షకులు అదంతా నాటకంలో భాగం అనుకున్నారు. దాన్ని ఏమీ చేయలేదు. ఆ కుక్క అలానే కోపంగా అరుస్తూ ఉండటంతో ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది. దాన్ని చెప్పుతో కొట్టి అక్కడినుంచి తరిమేశాడు. కుక్క కరిచినా కూడా రాధా కృష్ణన్ నాటకం ఆపలేదు. నాటకం పూర్తయిన తర్వాత అక్కడున్న వారికి విషయం చెప్పాడు. వారు ఆయన్ని కన్నూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రాధా కృష్ణన్ యాంటీ రేబీస్ వాక్సినేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న ఈవీల ధరలు..
సంచలన ప్రకటన.. త్వరలో డిజిటల్ కరెన్సీ