EV Prices In India: గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న ఈవీల ధరలు..
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:11 AM
రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. త్వరలో ఈవీల ధరలు తగ్గనున్నాయని ప్రకటించారు. రానున్న 4 నుంచి 6 నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలతో సమానంగా ఈవీల ధరలు ఉంటాయని అన్నారు.
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాలు కొనాలనుకునేవారు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఈవీల ధర ఎక్కువ ఉంటుంది. ఈవీలు అంత ధర ఉండటానికి కారణం వాటి బ్యాటరీలే. ఈ బ్యాటరీల కారణంగా ఈవీ కొనుగోలుదారులపై అధిక భారం పడుతుంది.
బ్యాటరీ ప్రాబ్లమ్ వస్తే అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అధిక ధరలు, బ్యాటరీ మెయిన్‌టెనెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఈవీలు కొనడానికి తటపటాయిస్తున్నారు. అలాంటి వారికి రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. త్వరలో ఈవీల ధరలు తగ్గనున్నాయని ప్రకటించారు. సోమవారం ఆయన ఎఫ్ఐసీసీఐ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..
నేను ఎలక్ట్రిక్ వాహనాలు లాంచ్ చేసినపుడు బ్యాటరీ ధర కిలోవాట్‌పర్ అవర్‌కు 150 డాలర్లు ఉండేది. ఇప్పుడు 55 డాలర్ల నుంచి 65 డాలర్ల మధ్యలో ఉంది. రానున్న నాలుగు నుంచి ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్, కార్లు, బస్సుల ధరలు పెట్రోల్, డీజల్ వాహనాలతో సమానంగా ఉంటాయి. ట్రాక్టర్లు తయారు చేసే వారు.. వ్యవసాయ పరిశోధకులు క్లీన్ ఎనర్జీ పరికరాలపై పని చేయాలి. ఇథనాల్‌తో నడిచే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఇంజిన్లు తయారు చేయాలి’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
సంచలన ప్రకటన.. త్వరలో డిజిటల్ కరెన్సీ
కాంగ్రెస్ బాకీలపై నిలదీయాలి..