VC Sajjanar: న్యూ ఇయర్ వేళ.. సీపీ సజ్జనార్ వార్నింగ్
ABN , Publish Date - Dec 31 , 2025 | 09:22 AM
మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పౌరులకు హైదరాబాద్ నగర సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచన చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పౌరులకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు కాల్ చేయాలని తెలిపారు. రైడ్ డీటెయిల్స్ స్క్రీన్‌షాట్.. ఈ వాట్సాప్ నెంబర్‌కు పంపించాలని కోరారు. ఈ ఫిర్యాదుకు వాహన నెంబర్, సమయం, ప్రదేశం వివరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.
బుధవారం (డిసెంబర్ 31వ తేదీ) అర్థరాత్రి క్యాబ్, ఆటో రైడ్‌కు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుక్ చేసిన ఛార్జ్ కంటే అధికంగా డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటర్ వాహనాల చట్టం 178 (3)(b) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల్లో భద్రతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వివరించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా వీసీ సజ్జనార్ హెచ్చరించారు.