Liquor Rates: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై మద్యం రేట్లు..
ABN , Publish Date - May 18 , 2025 | 04:59 PM
Liquor Rates: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను పెంచింది. అది కూడా క్వార్టర్, ఆఫ్, ఫుల్ బాటిళ్లపై ధరను పెంచింది.
హైదరాబాద్, మే 18: అసలే వేసవి కాలం. ఎండలు మండిపోతున్నాయి. అలాంటి వేళ..కూల్ కూల్‌గా మందు కొడదామనుకొనే మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యూలర్ పంపింది. క్వార్టర్ బాటిల్‌పై రూ. 10 పెంచింది. అలాగే ఆఫ్ బాటిల్‌కి రూ. 20, ఫుల్ బాటిల్‌పై రూ. 40 పెంచింది. ఈ మేరకు జారీ చేసిన సర్క్యూలర్లలో ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు.. ఇప్పటికే బీరు ధరలు ప్రభుత్వం పెంచింది. అలాగే మద్యం ధరలను సైతం పెంచాలని నిర్ణయించింది. ధరల కమిటీ సూచనలు, మద్యం కంపెనీల అభిప్రాయాలను తీసుకుని నెల క్రితమే ఎక్సైజ్ కమిషనర్ నివేదికను రూపొందించారు. అనంతరం దీనిని ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ పెంచిన మద్యం ధరలతో ఏడాదికి రూ. 2 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చే విధంగా నివేదిక రూపొందించింది. మద్యం సరఫరా కోసం.. లిక్కర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం జూన్ 30వ తేదీతో ముగియనుంది.
జులై 1వ తేదీ నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ లోపే మద్యం ధరలు పెంచి.. డిస్టిలరీలు, డిస్టిబ్యూటర్లు, సప్లై కంపెనీతో ఒప్పందాలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే.. ఛీప్ లిక్కర్ల ధరలు తెలంగాణలో అధికంగా ఉంది. ఇంకా ధరలు పెంచితే.. ఛీప్ లిక్కర్ వ్యాపారం కుప్పకూలిపోతుందని .. తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఎన్డీపీఎల్ మద్యం, ఫేక్ లిక్కర్ అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఛీప్ లిక్కర్ ధరలు నియంత్రణలో ఉంచాలని ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ధరలు పెరగకుండా కర్ణాటక తరహాలో మద్యాన్ని టెట్రా ప్యాకెట్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ప్రతి క్వార్టర్ మీద కనీసం రూ. 15 నుంచి రూ. 20 వరకు తగ్గే అవకాశముందని సమాచారం.
అదీకాక రెండు స్లాబ్లలో లిక్కర్ ధరలు పెంచేలా నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. అలాగే ఛీప్ లిక్కర్ ధరలు అలాగే ఉంచి మూడు క్యాటగిరీల లిక్కర్‌పై ధరలు పెంచాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ పరమైన చిక్కులు లేకుండా ప్రభుత్వం ఈ ధరలు పెంచినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News