SATS Chairman Sivasena Reddy: ఇది ఫ్రెండ్లీ మ్యాచ్.. కోల్‌కతా లాంటి సంఘటనలకు తావులేదు: శాట్స్ ఛైర్మన్
ABN , Publish Date - Dec 13 , 2025 | 03:56 PM
హైదరాబాద్‌లో దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీతో జరగబోయే మ్యాచ్.. ఫ్రెండ్లీగా మాత్రమే జరగనుందని శాట్స్ ఛైర్మన్ తెలిపారు. కోల్‌కతా లాంటి సంఘటనలు భాగ్యనగరంలో జరిగేందుకు అవకాశం లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 13: స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) నేడు(శనివారం) సాయంత్రం భాగ్య నగరానికి రానున్న సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో మెస్సీ జట్టుతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) టీమ్.. ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్ పూర్తిగా స్నేహపూర్వకంగా మాత్రమే జరగనుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్(SATS) ఛైర్మన్ శివసేనా రెడ్డి(Sivasena Reddy) ఏబీఎన్(ABN)కు తెలిపారు.
'నేడు జరగబోయేది పూర్తిగా ఫ్రెండ్లీ మ్యాచ్(Friendly Football Match).. పూర్తి స్థాయి మ్యాచ్ కాదు. కేవలం క్రీడలను ప్రోత్సహించడానికి మాత్రమే దీన్ని నిర్వహిస్తున్నాం. కోల్‌కతా(Kolkata) లాంటి సంఘటనలు హైదరాబాద్(Hyderabad)లో జరగవు' అని శివసేనా రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో విద్యార్థులు క్రీడలవైపు ఆలోచిస్తారని ఆయన అన్నారు. రాజకీయాల్లో అయినా, క్రీడల్లో అయినా.. రేవంత్‌దే పైచేయి అని కొనియాడారు.
అంతకముందు.. కోల్‌కతాలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో మెస్సీ(Messi) ఎక్కువ సేపు స్టేడియంలో సమయం కేటాయించలేకపోయాడు. మెస్సీని చూసేందుకు జనం భారీఎత్తున తరలిరావడంతో.. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం 10 నిమిషాల్లోనే అతణ్ని స్టేడియం నుంచి తీసుకెళ్లిపోయారు నిర్వాహకులు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు ఆగ్రహానికి లోనై స్టేడియంలోని కుర్చీలు విరగ్గొట్టినట్టు సమాచారం.
ఇవీ చదవండి:
లియోనల్ మెస్సికి సారీ చెప్పిన సీఎం మమతా బెనర్జీ
మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయిన మెస్సి.. ఫ్యాన్స్ ఆగ్రహం!