PC Ghose commission: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం
ABN , Publish Date - Jun 17 , 2025 | 10:10 AM
PC Ghose commission: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక మలుపు తిరిగింది. ప్రాజెక్టుకు సంబంధించిన మంత్రివర్గ సమావేశాల తీర్మానాలను అందించాలని పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి కమిషన్‌కు గత ప్రభుత్వ కేబినెట్ తీర్మానాల రికార్డులను అందించాలని ఆదేశించారు.
Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ (Kaleshwaram project commission) విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరంపై కేబినెట్ తీర్మానాలపై కమిషన్ ఆరా తీస్తోంది. ఈ మేరకు పీసీ ఘోష్ కమిషన్ ( PC Ghose commission) ప్రభుత్వానికి లేఖ (Letter) రాసింది. కాళేశ్వరంపై మంత్రివర్గ తీర్మానాలను ఇవ్వాలని కోరింది. కేబినెట్ తీర్మానాల మేరకే నిర్ణయాలు జరిగాయని కమిషన్ విచారణలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, నాటి మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ నేపథ్యంలో కేబినెట్ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కమిషన్ కోరింది. అయితే కాళేశ్వరంకు కేబినెట్ ఆమోదం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం గత ప్రభుత్వ కేబినెట్ తీర్మానాల రికార్డులను ప్రభుత్వం కమిషన్‌కు పంపించనుంది.
కాగా కాళేశ్వరం ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటలను కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. కేబినెట్ ఆమోదంతో అన్ని నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్, హరీష్‌రావు, ఈటల చెప్పడంతో కమిషన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆనాటి మంత్రివర్గ తీర్మానాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 13న నీటిపారుదలశాఖకు కూడా లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నిన్న (సోమవారం) మంత్రుల సమావేశంలో చర్చించారు. అంతేకాదు కమిషన్‌కు అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు
ఛార్లెట్‌లో ధీమ్ తానా పోటీలు విజయవంతం
For More AP News and Telugu News