Share News

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:27 AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ.. బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

హైదరాబాద్, అక్టోబర్ 15: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ బుధవారం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దాంతో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. ఈ రోజు అంటే బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Lankala.jpg


మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. కానీ అభ్యర్థి ఎంపిక కోసం నియోజకవర్గంలోని పలువురి సీనియర్ల పేర్లను బీజేపీ పరిగణలోకి తీసుకుంది. అందుకు సంబంధించిన జాబితాను రూపొందించి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యూఢిల్లీ తీసుకు వెళ్లి.. బీజేపీ అధిష్టానం ముందు ఉంచారు. అధిష్టానం లంకల దీపక్ రెడ్డిని ఎంపిక చేసింది.


2023 ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ బరిలో దిగి గెలిచారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఇటీవల మరణించారు. దీంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.


తాజాగా ఉప ఎన్నిక పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆ క్రమంలో మాగంటి గోపినాథ్ భార్య సునీతను బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా బరిలో దింపింది. అలాగే నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి తాజాగా ప్రకటించింది.


ఈ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే జూబ్లీహిల్స్ ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టాడనేది ఆ రోజుతో తెలిపోనుంది.

ఇవి కూడా చదవండి:

దారుణం.. ఆ చిన్నారులు దీపావళి వేడుకలకు దూరం.. ఎందుకంటే..?

ఏబీఎన్ ఎఫెక్ట్‌.. స్పందించిన ప్రభుత్వం.. తీరనున్న ఉల్లి రైతు కష్టాలు..

For More TG News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 04:00 PM