Share News

Diwali Celebrations: దారుణం.. ఆ చిన్నారులు దీపావళి వేడుకలకు దూరం.. ఎందుకంటే..?

ABN , Publish Date - Oct 15 , 2025 | 08:27 AM

దీపావళి పండగను చిన్న పెద్దలంతా కలిసి జరుపుకుంటారు. కానీ ఈ వేడుకలను జరుపుకొని ప్రజలు సైతం ఈ దేశంలో ఉన్నారు.

Diwali Celebrations: దారుణం.. ఆ చిన్నారులు దీపావళి వేడుకలకు దూరం.. ఎందుకంటే..?

దీపావళిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రతీకగా వయస్సుతో సంబంధం లేకుండా.. చిన్న పెద్దలంతా కలిసి ఈ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. కానీ కొన్ని గ్రామాలు ప్రజలు మాత్రం ఈ పండగకు దూరంగా ఉన్నారు. అది కూడా కొన్ని దశాబ్దాలుగా ఈ పండగ వేడుకలకు వారంతా దూరంగా ఉన్నారు. ఆ గ్రామాలు పంజాబ్‌లో ఉన్నాయి. అందుకు కారణం.. ఆర్మీ కంటోన్మెంట్‌, ఆయిల్ డిపోలు ఆ గ్రామాలకు సమీపంలో ఉండడమే.


1976లో పంజాబ్‌‌లోని బఠిండా ప్రాంతంలో కంటోన్మెంట్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ సమీపంలోని ఫస్ మండీ, భాగు, గులాబ్‌గఢ్ గ్రామాల ప్రజలపై స్థానిక ఆర్మీ ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. దీపావళి వేళ.. ఆ యా గ్రామాల్లో బాణసంచాతోపాటు పంట వ్యర్థ్యాలను సైతం కాల్చరాదంటూ ముందుగానే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారు. ఒక వేళ ఎవరైనా ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తే మాత్రం.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.


దీపావళి పండగ వేళే కాదు.. పంట పొలాల్లోని వ్యర్థాలకు చిన్నపాటి మంట పెట్టినా ఆర్మీ అధికారుల ఏ మాత్రం ఉపేక్షించరు. ఆ వెంటనే అందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటామంటూ వారు ఆదేశాలు జారీ చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామాల్లోని చిన్నారులంతా.. అమ్మమ్మ తాతయ్యల ఇంటికి లేకుంటే.. వారి బంధువుల వద్దకు వెళ్లి ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారని స్థానికులు వివరిస్తున్నారు.


అంతేకాదు.. కంటోన్మెంట్ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ యా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా.. ఫలితం మాత్రం లేదని వారు పెదవి విరుస్తున్నారు.


మరోవైపు.. తమిళనాడులోని శివగంగ జిల్లాలో కొల్కుడ్పట్టి, వెట్టంగుడిపట్టి గ్రామాల ప్రజలు సైతం దీపావళి పండగ వేళ టపాసులు కాల్చరు. ఎందుకంటే.. వెట్టంగుడిపట్టి అభయారణ్యానికి ప్రపంచంలోని వివిద దేశాల నుంచి కొన్ని దశాబ్దాలుగా వలస పక్షులు వస్తుంటాయి. ముఖ్యంగా శీతాకాలం.. అంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో స్విట్జర్లాండ్, రష్యా, ఇండోనేషియా, శ్రీలంక తదితర సుదూర ప్రాంతాల నుంచి ఈ అభయారణ్యానికి పక్షులు వస్తుంటాయి.


ఈ సందర్భంగా కొన్ని రకాల పక్షలు ఇక్కడ పిల్లల్ని సైతం కంటాయి. అలా వలస వచ్చిన పక్షులు భయపడకుండా వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ గ్రామస్తులు దీపావళి వేళ.. టపాసులను కాల్చరు. అలా దీపావళి పండగకు దూరంగా ఉంటారు.

Updated Date - Oct 15 , 2025 | 08:36 AM