Share News

IiBomma Ravi Case: మూడోసారి కస్టడీలోకి ఐబొమ్మ రవి.. గుట్టు విప్పేనా?

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:31 PM

ఐబొమ్మ రవిని మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 12 రోజుల పాటు రవిని పోలీసులు విచారించనున్నారు.

IiBomma Ravi Case: మూడోసారి కస్టడీలోకి ఐబొమ్మ రవి.. గుట్టు విప్పేనా?
IiBomma Ravi Case

హైదరాబాద్, డిసెంబర్ 18: ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మంది రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో అతణ్ని సైబర్ క్రైమ్ పోలీసులు మూడోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో కేసులో నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. కోర్టు అనుమతి మేరకు ఈరోజు (గురువారం) చంచల్‌గూడా జైలు నుంచి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.


ఈ కేసుకు సంబంధించి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు రెండుసార్లు కస్టడీలో తీసుకుని విచారించారు. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. పైరసీ లింకులు, బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన డబ్బులు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా.. రెండు సంవత్సరాల క్రితం 'పట్టుకోండి చూద్దాం' అంటూ ఏకంగా పోలీసులకే సవాల్ విసిరాడతడు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు రవిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


రవితోనే ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లను బ్లాక్ చేయించారు. ఈకేసులకు సంబంధించి రవిని మరింతగా విచారించాలని పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించింది. రవిని మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మూడు కేసుల్లో 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు.


ఇవి కూడా చదవండి...

ఖమ్మంలో గంజాయి లేకుండా చేస్తా: మంత్రి తుమ్మల

తెలంగాణ విద్యుత్ రంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 18 , 2025 | 03:51 PM