Drugs: హైదరాబాద్‌లో ప్రేమ, సహజీవనం ముసుగున డ్రగ్స్ దందా
ABN , Publish Date - Dec 21 , 2025 | 08:17 AM
హైదరాబాద్, బెంగళూరు, గోవాలో ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేసి.. వారికి డ్రగ్స్ అలవాటు చేసి, ఆపై వారిని ఏజెంట్లుగా నియమించి డ్రగ్స్ దందా చేస్తున్న యెమెన్‌కు చెందిన వ్యక్తి..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 21: హైదరాబాద్‌లో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (HNEW) అధికారులు ఒక నైజీరియన్ వ్యక్తిని డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చిన ఈ నిందితుడు, ప్రేమ, సహజీవనం పేరుతో యువతులను మోసం చేసి వారిని డ్రగ్స్ ఏజెంట్లుగా మార్చినట్టు తెలుస్తోంది.
నాలుగేళ్లుగా పోలీసుల కంటపడకుండా డ్రగ్స్ విక్రయాలు సాగించిన సదరు నైజీరియన్, మూడు నెలలకు ఒకసారి నగరం మారుస్తూ హైదరాబాద్, బెంగళూరు, గోవాలో ఐదు ఇళ్లను అద్దెకు తీసుకుని దందా నిర్వహించాడని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఏడుగురు యువతులతో సహజీవనం చేసిన నిందితుడు, డ్రగ్స్ అలవాటు పడిన యువతులను గుర్తించి ఉచితంగా మాదకద్రవ్యాలు ఇచ్చి ప్రేమ ముసుగులో వారి చేత డ్రగ్స్ తరలింపు చేయించేవాడు.
కొంపల్లిలో నర్సుగా పనిచేస్తున్న ఒక యువతికి పరిచయమై, ఆమె ఇంట్లోనే డ్రగ్స్ దాచి పెట్టడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి డ్రగ్స్ విక్రయాలకు కోడ్ భాష వాడేవాడు. ఉదాహరణకు, మాల్ కావాలా అని అడిగేందుకు 3 ప్రశ్నార్థకాలు(???) పంపేవాడు, డ్రగ్స్ రెడీ అయితే 'మూడు చుక్కలు' సందేశం ఇచ్చేవాడు.
గంజా కోసం 'ఓషన్', గ్రీన్ ఎండిఎంఏ కోసం 'సముద్రం', ముంబైలో MDMAకు 'బకరా' అని సింబల్స్ వాడేవాడు. అన్ని రకాల డ్రగ్స్‌కు కామన్ కోడ్‌గా 'స్కోర్' ఉపయోగించి, 'మామ స్కోర్ చేసావా?' అంటూ ఆర్డర్లు తీసుకునేవాడు. ఈ డ్రగ్స్ దందా మీద అధికారులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..
నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్