Hyderabad Judge Attack: జడ్జి కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి.!
ABN , Publish Date - Oct 09 , 2025 | 09:27 AM
హైదరాబాద్ నగరంలో ఒక సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాంపల్లి క్రిమినల్ కోర్టు XVII అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేస్తూ..
హైదరాబాద్: నగరంలో ఒక సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాంపల్లి క్రిమినల్ కోర్టు XVII అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి కారుపై గుర్తు తెలియని వ్యక్తి సోమవారం దాడి చేశాడు.
జడ్జి తన కారులో వెళుతుండగా చంచల్‌గూడ జైలు సమీపంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కారు ముందు నిలబడ్డాడు. ఆ వ్యక్తి కార్ అద్దాలను కొడుతూ, అనుచిత పదజాలంతో జడ్జిని దూషించినట్లు సమాచారం. జడ్జి కారులో ఉన్నారని డ్రైవర్ చెప్పినప్పటికీ, ఆ వ్యక్తి దుర్బాషలాడుతూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో షాక్‌కు గురైన జడ్జి కారు డ్రైవర్ వెంటనే మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లు సేకరించి పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో న్యాయ వ్యవస్థకు చెందిన వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జడ్జిల భద్రతపై పోలీసులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News