Share News

Hyderabad Rains: నగరంలో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు

ABN , Publish Date - Sep 27 , 2025 | 08:53 PM

నగరంలో భారీ వర్షం కురుస్తోంది. రోజూ మాదిరే ఇవాళ (శనివారం) రాత్రి కూడా ఎనిమిది గంటల నుంచి భారీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దవుతున్నారు. వాహనదారులు..

Hyderabad Rains: నగరంలో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు
Hyderabad Heavy Rain

హైదరాబాద్‌, సెప్టెంబర్ 27: రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. రోజూ మాదిరే ఇవాళ (శనివారం) రాత్రి కూడా ఎనిమిది గంటల నుంచి భారీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మణికొండ, గచ్చిబౌలి, బేగంబజార్, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రోడ్లపై వరద నీటితో వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


ఇవి కూడా చదవండి..

ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..

షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2025 | 09:28 PM