Hyderabad Grand Bhatukamma: ట్యాంక్‌బండ్‌పై ఘనంగా బతుకమ్మ సంబరాలు..
ABN , Publish Date - Sep 30 , 2025 | 07:22 PM
బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ సందర్భంగా పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు.
హైదరాబాద్: బతుకమ్మ పండుగ చివరి రోజు కావడంతో.. భాగ్యనగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంట్టాయి. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. బతుకమ్మ చుట్టూ.. చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తొమ్మిది రోజులు జరిగే... బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచే బతకమ్మ పండుగలో ఇవాళ(మంగళవారం) చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగ స్త్రీ అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం