Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సీపీ సజ్జనార్ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో సీపీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ప్రభాకర్ రావును సైతం సీపీ సజ్జనార్ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయి ఛార్జిషీట్‌కు సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌లో సిట్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. ఈ నేపథ్యంలో అందరూ జవాబుదారితనంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
మరో వైపు ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును గత 10 రోజులుగా కస్టోడియల్ విచారణలో ఉన్నారు. ఈ విచారణలో ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. తొలుత చార్జీషీట్ వేసి.. అనంతరం కేసుతో సంబంధమున్న వారందరిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులతో పాటు ఉన్నతాధికారులను సైతం విచారించేందుకు సిట్ తగిన ఏర్పాట్లు చేస్తోంది.
ఈ కేసులో నిందితుడు ప్రభాకర్ రావును సిట్ చీఫ్ ప్రభాకర్ రావు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులను ఏసీపీ, డీసీపీ, జాయింట్ సీపీ స్థాయి అధికారులు మాత్రమే విచారించారు. కమిషనర్ స్థాయిలో అధికారి.. నిందితుడిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
కవిత గురించి కేసీఆర్ ఏం వివరణ ఇస్తారో చూద్దాం: పీసీసీ చీఫ్
ఈ పాలు తాగితే.. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, అలర్జీ.. అన్ని దూరం
For More TG News And Telugu News