Helmet Awareness Campaign: హెల్మెట్ ఆవశ్యకతపై ‘యమధర్మరాజు’తో ప్రచారం.. సర్వేజనా ఫౌండేషన్ కార్యక్రమం
ABN , Publish Date - Dec 04 , 2025 | 09:43 AM
హెల్మెట్ ఆవశ్యకతపై సర్వేజనా ఫౌండేషన్ హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా యమధర్మరాజు వేషధారణలోని వ్యక్తి హెల్మెట్ పెట్టుకోని వాహనదారులను అప్రమత్తం చేశాడు. ఒక తల పోతే ఇంకో తల రాదంటూ సరదా కామెంట్స్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టూవీలర్స్ నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. ఇది తెలిసి కూడా అనేక మంది హెల్మెట్ పెట్టుకోకుండానే వాహనాలపై దూసుకుపోతుంటారు. ఈ క్రమంలో కొందరు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సర్వేజనా ఫౌండేషన్ హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. యమధర్మరాజు వేషధారణలోని వ్యక్తితో హెల్మెట్ ప్రాముఖ్యతపై ప్రచారం చేయించింది (Helmet Awareness Campaign).
బుధవారం రసూల్‌పుర సిగ్నల్ వద్ద సర్వేజనా ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. యుముడి వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి హెల్మెట్ లేని ప్రతి వాహనదారుడి వద్దకు వెళ్లి హెచ్చరించే ప్రయత్నం చేశారు. ‘హెల్మెట్ ధరించకపోతే ప్రమాదం జరిగినప్పుడు నేనే వచ్చి నీ ప్రాణం తీసుకెళతా’ అని సరదా వార్నింగ్ ఇచ్చారు. ఒక తల పోతే మరో తల రాదు అని కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ అధిపతి డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. నగరంలోని 365 ప్రధాన జంక్షన్లలో ఏడాది పాటు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి కరెంట్ కట్..
Read Latest Telangana News And Telugu News