Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి కరెంట్ కట్..
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:59 AM
హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాల్లో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు ఇతర కారణాల రీత్యా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పంజాగుట్ట(హైదరాబాద్): బంజారాహిల్స్ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ పీఈఐఓహెచ్, అరోరా కాలనీ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ సీ-బ్లాక్, వెంకటేశ్వరహిల్స్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్.వి.సత్యనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ అవంతి నగర్, బేగంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ కార్మిక నగర్, మెథడిస్ట్ కాలనీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
అల్లాపూర్: అల్లాపూర్ డివిజన్(Allapur Division)లోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాకేష్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. పర్వత్‌నగర్ ఫీడర్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పర్వత్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి, జనప్రియనగర్, పర్వత్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాయం ఉంటుందని తెలిపారు. 11 కేవీ హ్యుందాయ్ ఓహెచ్ ఫీడర్ పరిధిలోని ఖైతలాపూర్ ఫ్లైఓవర్ ఎస్‌బీఐ బ్యాంక్ కాలనీ, ఆర్‌ఆర్‌ఆర్ బార్ అండ్ రెస్టారెంట్, చందానాయక్ తండా ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు విద్యుత్ ఉండదన్నారు.

చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్(Azamabad Division), హైదరాబాద్ సిటీ-1 పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్‌కుమార్ తెలిపారు. డిడికాలనీ, బర్కత్‌పురా డిపో, గాంధీకుటీర్, మేల్కోటె, విఠల్‌వాడి, కూచిపూడి, ఆర్‌కె మఠ్, దిల్‌కుష 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1, కమలానగర్, గోల్నాక, బర్కత్‌పుర, నల్లకుంట మార్కెట్, ఆజామాబాద్ కీఎ్‌సఎస్, రామ్‌నగర్, ముషీరాబాద్, షాదాన్ కాలేజ్ పరిధిలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
రామంతాపూర్: రామంతాపూర్ సబ్ స్టేషన్(Ramanthapur Sub Station) పరిధిలోని గణే్‌షనగర్ ఫీడర్‌లోని మెయిన్ రోడ్డు, పాత రామంతాపూర్, శారదానగర్, సీడీటీఐ, సీఎ్‌ఫఎ్‌సఎల్, కిన్నెర గ్రాండ్ హోటల్, బజాజ్ ఎలక్ర్టానిక్స్‌లలో ఈనెల 4న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని, సంబంధిత ట్రాన్స్‌కో ఏఈ కూతాడి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు.
రాయదుర్గం: ఓల్డ్‌గచ్చిబౌలి విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇందిరానగర్, ఓల్డ్ గచ్చిబౌలి, సెంట్రల్ మాల్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు. జేవీ కాలనీ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జేవీ కాలనీలో విద్యుత్ ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
Read Latest Telangana News and National News