Share News

Rains: భారీ వర్షం.. భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్

ABN , Publish Date - Jul 21 , 2025 | 06:28 PM

హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సోమవారం సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య భారీ వర్షం కురిసే అవకాశముంది. దీంతో నగరంలోని ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Rains: భారీ వర్షం.. భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్
Heavy rains

హైదరాబాద్, జులై 21: హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సోమవారం సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య భారీ వర్షం కురిసే అవకాశముందని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప.. అనవసరంగా ప్రయాణాలు చేయవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ నగర పాలక సంస్థ, డీఆర్ఎఫ్ అందించే సమాచారాన్ని తెలుసుకుని.. వారి సూచనలు పాటించాలని విజ్ఞప్తిచేశారు.


తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో సైతం ఇటీవల పలు రోజులపాటు వరుసగా వర్షాలు కురిసిన విషయం విదితమే. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. అలాగే ఉన్నతాధికారులకు సైతం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో.. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.


మరోవైపు జులై 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే భారత వాతావరణ విభాగం వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సైతం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ వర్షాలు.. సోమ, మంగళవారాలే కాకుండా.. మరో రెండు రోజులు వరకు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరి ముఖ్యంగా తూర్పు, దక్షిణ, మధ్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఉదయం, సాయంత్రమే కాకుండా రాత్రి సమయాల్లో సైతం భారీ వర్షం కురుస్తుందని వివరించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

వారికి గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్థానిక ఎన్నికలపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

బెట్టింగ్ యాప్ కేసులో సినీ సెలబ్రిటీలకు బిగ్ షాక్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 06:43 PM