Share News

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం

ABN , Publish Date - Aug 17 , 2025 | 09:50 PM

హైదరాబాద్ మహానగరంలోని భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా.. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా నీరు వచ్చి చేరింది.

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్ మహానగరంలోని భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా.. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అదివారం సెలవు దినం అయినా.. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు మెల్లగా సాగుతున్నాయి. అయితే భారీ వర్షం కారణంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.


ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాలు జలమయమైనాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టాయి.


మరోవైపు.. భారీ వర్షాలు కారణంగా.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని ప్రధాన రహదారుల్లోని వీధి దీపాలు సైతం వెలగడం లేదు. ఇక భారీ వర్షానికి ఈదురు గాలులు సైతం తొడయ్యాయి. దీంతో ఆదివారం కావడంతో.. పిల్లలతో కలిసి బయటకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 09:52 PM