CM Revanth Reddy At Gun Park: గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం ఘన నివాళి
ABN , Publish Date - Sep 17 , 2025 | 10:06 AM
ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో గన్‌పార్క్‌లో ఉన్న అమర వీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం రేవంత్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రభుత్వం.. ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. సచివాలయానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత నూతన విద్య విధానంపై ఉన్నతాధికారులతో సమావేశమై.. సీఎం రేవంత్ చర్చించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు.. రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు
ప్రారంభమైన వైష్ణో దేవి యాత్ర.. భక్తులకు కీలక సూచన
Read Latest Telangana News and National News