Golkonda Resorts And Spa: లగ్జరీ రిసార్ట్‌గా 'ది గోల్కొండ రిసార్ట్స్ అండ్ స్పా'కు గొప్ప గుర్తింపు
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:41 PM
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌గా 'ది గోల్కొండ రిసార్ట్స్ అండ్ స్పా'కు గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డును ప్రదానం చేశారు. గోల్కొండ రిసార్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి..
హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌గా 'ది గోల్కొండ రిసార్ట్స్ అండ్ స్పా'కు గొప్ప గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని బెస్ట్ 5-స్టార్ రిసార్ట్, టాప్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఈ రిసార్ట్‌కు అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణలో ఉత్తమ 5 స్టార్ రిసార్ట్, వివాహ గమ్యస్థానం కేటగిరిలో ఈ అవార్డు సొంతం చేసుకుంది. హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డును ప్రదానం చేశారు. గోల్కొండ రిసార్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి అవార్డును అందుకున్నారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 'తెలంగాణలో టూరిజం రంగాన్ని ప్రోత్సహించడం మా ప్రభుత్వ ప్రాధాన్యత. గోల్కొండ రిసార్ట్స్ వంటి సంస్థలు రాష్ట్ర టూరిజంను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాయి. వెడ్డింగ్స్, కాన్ఫరెన్స్‌లు, ఫ్యామిలీ గేట్‌వేలకు ఇది ఆదర్శవంతమైన గమ్యస్థానం' అని అన్నారు.
సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 'ఈ గుర్తింపు మా టీమ్‌కు గొప్ప ప్రేరణ. తెలంగాణ టూరిజంను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాం' అని తెలిపారు. ఇలా ఉండగా, ప్రపంచ టూరిజం డేలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ అవార్డు ద్వారా రాష్ట్రంలోని టూరిజం సంస్థలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నారు.
కాగా, ఉస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున 13 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన 'గోల్కొండ రిసార్ట్స్ అండ్ స్పా' హైదరాబాద్ నగరం నుంచి కేవలం కొన్ని నిమిషాల దూరంలో ఉంది. ఈ రిసార్ట్‌లో 44 లగ్జరీ విల్లాలు, ప్రీమియం రూమ్‌లు, స్పా, స్విమ్మింగ్ పూల్‌లు, టెన్నిస్ కోర్ట్‌లు, జిమ్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, 60,000 చదరపు అడుగుల ఔట్‌డోర్ బాన్‌క్వెట్ స్పేస్‌తో పాటు ఇండోర్ కాన్ఫరెన్స్ హాల్‌లు ఉన్నాయి. ఇవి 2,000 మంది వరకు ఆతిధ్యమివ్వగలవు. ఇక్కడి 'జ్యువెల్ ఆఫ్ నిజాం' రెస్టారెంట్ నిజామీ వంటకాలతో ప్రసిద్ధి చెందింది.
ఇక, వెడ్డింగ్ డెస్టినేషన్‌గా గోల్కొండ రిసార్ట్స్ అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. సంగీత్, మెహెందీ, కాక్‌టెయిల్ పార్టీలు, రిసెప్షన్‌లు, షాదీ వంటి అన్ని ఈవెంట్‌లకు సరైన డెస్టినేషన్‌గా పేరుపొందింది. డెడికేటెడ్ ఈవెంట్ కోఆర్డినేటర్‌లు, అవార్డు గ్రహీత క్యాటరింగ్ టీమ్‌తో పాటు, హాస్పిటాలిటీ సర్వీసెస్ అక్కడి పెళ్లిళ్లను అనిర్వచనీయంగా మారుస్తున్నాయి. ట్రిప్ అడ్వైజర్‌లో 4/5 రేటింగ్, 1,300కి పైగా రివ్యూలతో ఈ రిసార్ట్ ట్రావెలర్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

ఇవి కూడా చదవండి..
ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..
షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..