Share News

Ganesh Chaturthi 2025: మీ ఏరియాలో వెరైటీ వినాయక విగ్రహాలు ఉన్నాయా? మేం ప్రపంచానికి చూపిస్తాం..

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:23 PM

వినాయక చవితి.. మతపరమైన ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు. ఎంతో మందికి ఒక ఎమోషన్. వినాయక చవితి ఎప్పుడొస్తుందా.. అని ఎదురు చూసేవాళ్లు కోకొల్లలు. గణేష్ చతుర్థికి ప్రతి ఇల్లు, గల్లీ ఒక పండుగ వేదికలా మారిపోతుంది.

Ganesh Chaturthi 2025: మీ ఏరియాలో వెరైటీ వినాయక విగ్రహాలు ఉన్నాయా? మేం ప్రపంచానికి చూపిస్తాం..
Ganesh Chaturthi 2025

వినాయక చవితి.. మతపరమైన ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు. ఎంతో మందికి ఒక ఎమోషన్. వినాయక చవితి ఎప్పుడొస్తుందా.. అని ఎదురు చూసేవాళ్లు కోకొల్లలు. గణేష్ చతుర్థికి ప్రతి ఇల్లు, గల్లీ ఒక పండుగ వేదికలా మారిపోతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లో, గల్లీలలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం గల్లీల్లో వినాయక విగ్రహాలు కొత్త కొత్త రూపాల్లో, విభిన్న డిజైన్లతో దర్శనమిస్తుంటాయి. కొంతమంది భక్తులు పర్యావరణహితంగా ఉండే వినాయకుడిని నెలకొల్పుతారు. మరికొందరు ఇతిహాసాలు ఆధారంగా రూపొందిస్తారు, ఇంకొందరు సమకాలీన విషయాలను వినాయక రూపంలో చూపిస్తారు.


ఈ ఏడాది మీరు కూడా వినాయకుడిని పెడుతున్నారా..? విభిన్నమైన గణనాథుడి ప్రతిమను ఏర్పాటు చేశారా..? మీరు నెలకొల్పిన లేదా మీ ఏరియాలో ఉన్న వినాయకుడిని ప్రపంచానికి చూపించాలని అనుకుంటారా? మీ గల్లీ వినాయకుడి ప్రత్యేకతను అందరికి తెలియజేయాలని చూస్తున్నారా?.. అయితే, మీకోసం మన ABN – ఆంధ్రజ్యోతి ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. మీరు ABN ద్వారా మీ గల్లీ వినాయకుడిని ప్రపంచానికి చూపించవచ్చు.


ఇందుకోసం మీరు ఏం చేయాలంటే..?

మీ గల్లీలోని వినాయక విగ్రహం ఒక నిమిషం నిడివి కలిగిన వీడియో తీసుకోండి. ఆ వీడియోను #ABNVV అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. మీరు పెట్టిన వీడియోను మా ABN టీమ్ పరిశీలించి.. ఎంపిక చేసి ప్రచూరిస్తాం. పంపే సమయంలో మీ గల్లీ పేరు, నగరం మెన్షన్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను తీసుకొని.. వీడియో తీసి మాకు పంపించండి. మేము మీ వినాయకుడిని ప్రపంచానికి చూపిస్తాం.

Updated Date - Aug 26 , 2025 | 01:23 PM