Share News

Amit Shah: పాలనైనా.. గ్రౌండ్ గేమ్ ఐనా, అమిత్ షా ది గ్రేట్: బండి సంజయ్

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:40 PM

ఆర్టికల్ 370 రద్దు మొదలు.. భారతదేశ అంతర్గత భద్రతా నిర్మాణాన్ని పునర్నిర్మించడం వరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణం అమోఘం అన్నారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయమంత్రి బండి సంజయ్.

Amit Shah: పాలనైనా.. గ్రౌండ్ గేమ్ ఐనా,  అమిత్ షా ది గ్రేట్: బండి సంజయ్
Bandi Sanjay and Amit Shah

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో అత్యంత ఎక్కువ కాలం కేంద్ర హోం మంత్రిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు అమిత్ షా అంటూ కీర్తించారు తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రిత్వశాఖ సహాయమంత్రి బండి సంజయ్. తన ప్రభావవంతమైన నిర్ణయాలతో, అమిత్ షా.. 2,258 రోజులు పదవిలో ఉన్నారని బండి చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు మొదలు, భారతదేశ అంతర్గత భద్రతా నిర్మాణాన్ని పునర్నిర్మించడం వరకు, అమిత్ షా.. మంత్రిత్వ శాఖలో గడిపిన సమయం అసాధారణమైనదని బండి సంజయ్ అన్నారు.


'అమిత్ షా గౌరవనీయ మార్గదర్శకత్వం.. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నేను నేర్చుకోగలిగినందుకు, పని చేయగలిగినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నా' అంటూ బండి సంజయ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాలన అయినా లేదా గ్రౌండ్ గేమ్ అయినా, అమిత్ షా భారత రాజకీయాలపై ఆయనకున్న పట్టును ఎవరూ సరిపోల్చలేరంటూ అమిత్ షాను ఆకాశానికెత్తారు బండి సంజయ్. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌లు

నేడు సీమలో భారీ వర్షాలు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 04:40 PM