Share News

Jagadish Reddy suspended: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జగదీష్ రెడ్డి సస్పెండ్

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:15 PM

Jagadish Reddy suspended: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ గట్టి షాక్ తగిలింది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.

 Jagadish Reddy suspended: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జగదీష్ రెడ్డి సస్పెండ్
Jagadish Reddy suspended

హైదరాబాద్, మార్చి 13: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (BRS MLA Jagadish Reddy) సభ నుంచి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) తెలిపారు. సస్పెండ్ అయిన సభ్యుడిని సభ నుంచి బయటకు పంపాలని స్పీకర్ ఆదేశించారు. కాగా.. స్పీకర్‌పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించాయి. ‘మీరు మేము ఎన్నకుంటేనే స్పీకర్ అయ్యారు. సభ మీ ఒక్కరిదీ కాదు - సభ అందరదీ’ అని స్పీకర్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


అంతకుముందు జగదీష్ వ్యాఖ్యలపై శాసనసభలో హాట్ డిస్కషన్ జరిగింది. సభ లోపల, బయట స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. ఏకవచనంతో స్పీకర్పై మాట్లాడటం బాధాకరమన్నారు. స్పీకర్‌ను అవమానించకుండా ఆదర్శనీయ నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని.. అప్పటి వరకు ఈ సేషన్ మొత్తం ఆ సభ్యున్ని సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

CM Revanth on MLC Seats: ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై సీఎం క్లారిటీ


మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈరోజు సభ్యుడు మాట్లాడిన భాష అత్యంత అవమానకరమన్నారు. ఒక దళితజాతి బిడ్డ స్పీకర్‌గా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని.. స్పీకర్‌ను టార్గెట్ చేయడం బాధాకరమన్నారు. ఆ సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. బలహీన వర్గాలు ఇప్పుడిప్పుడే ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక... బీఆర్ఎస్ అడిగినన్ని సార్లు అవకాశం ఇచ్చారన్నారు. జగదీష్ రెడ్డి అత్యంత అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. మీకు మీకు అని మాట్లాడడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. గవర్నర్‌ను పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్త అని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గవర్నర్ మాట్లాడింది.. తమ ప్రభుత్వ విధానం అని కేసీఆర్ సభలో చెప్పలేదా అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను దారుణంగా అవమానించారన్నారు. జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్ ను కోరుతున్నాని మంత్రి సీతక్క తెలిపారు.


ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లను సస్పెండ్ చేశారన్నారు. పార్లమెంట్‌లో టీఎంసీ సభ్యుడు ప్రవర్తన సరిగా లేనందున సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. జగదీష్‌ రెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. సభ్యులు చర్చ అనంతరం జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.


చీఫ్ మార్షల్‌తో వాగ్వాదం..

అయితే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరగా.. అందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు వచ్చేశారు. సస్పెండ్ అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కూర్చున్న జగదీష్ రెడ్డిని అసెంబ్లీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని చీఫ్ మార్షల్ కోరారు. అయితే సభా వ్యవహారాల నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని చీఫ్ మార్షల్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వాదించారు. ఏ రూల్ ప్రకారం బయటికి పంపాలని చూస్తున్నారని అడిగి రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెప్పారు. దీంతో చీఫ్ మార్షల్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Congress vs BRS: ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 13 , 2025 | 04:35 PM