Share News

ED: నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:31 AM

ఆస్తులు మొత్తాన్ని గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలాబేగం, సయ్యద్ నిలోఫర్ , ఫిర్దోస్ అంజూమ్, మహమ్మద్ ఆరిఫ్ ,హసీనా కౌసర్ పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడి గుర్తించింది. వీరి పేర్లను ఈసీఐఆర్ (ECIR)లో నమోదు చేసింది.

 ED: నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..
Gangster Nayeem Case

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసు (Gangster Nayeem Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ముమ్మరం చేసింది. నయీంకు సంబంధించిన 35 ఆస్తులు (35 Benami Assets) జప్తు చేసేందుకు ఈడి అధికారులు (ED Officers) చర్యలు చేపట్టారు. 35 ఆస్తులను నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ (Regisgtration) చేసినట్లు ఈడి గుర్తించింది. అక్రమంగా, బలవంతంగా ఈ ఆస్తులను నయీం తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నట్టు నిర్ధారించారు. 2022 మార్చిలో నయీం ఆస్తులపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) నమోదు చేశారు. అప్పటి ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ఈసీఐఆర్ (ECIR) నమోదు చేసింది.

Also Read..: గోరంట్లపై తాడేపల్లి పీఎస్‌లో కేసు


ఆస్తులు మొత్తాన్ని నయీం కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలాబేగం, సయ్యద్ నిలోఫర్ , ఫిర్దోస్ అంజూమ్, మహమ్మద్ ఆరిఫ్ ,హసీనా కౌసర్ పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడి గుర్తించింది. వీరి పేర్లను ఈసీఐఆర్ (ECIR)లో నమోదు చేసింది. పలుమార్లు ఈడి సమన్లు పంపిన కూడా నయీం కుటుంబ సభ్యులు స్పందించలేదు. భువనగిరిలో ఉన్న క్రిస్టియన్ గోస్పెల్ మిషన్ సెక్రెటరీ ప్రభాకర్ నయీంపై ఫిర్యాదు చేశారు. నయీo కుటుంబ సభ్యులు పేరు మీద అక్రమంగా ఆస్తులను రాయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించినా నయీం కుటుంబ సభ్యులు ఐటీ రిటర్న్స్ దాకలు చేయలేదు. దీంతో బినామీ యాక్టు కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేయనున్నారు. కాగా 2020 మార్చిలో నయీంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.


కాగా గ్యాంగ్‌స్టర్ నయీం 2016 ఆగస్టులో షాద్‌నగర్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. నయీం మరణించడంతో అతని బాధితులంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేశారు. వాటిని విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసింది. విచారణలో దాదాపు 250 కేసులు నమోదు చేశారు. ఇందులో 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వీటికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కేసుల దర్యాప్తు పూర్తి కాలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒంటిమిట్ట కోదండరామునికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు

తహవ్వుర్‌ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ

For More AP News and Telugu News

Updated Date - Apr 11 , 2025 | 11:31 AM