Share News

Sahiti Infra: సాహితీ స్కామ్‌లో డైరెక్టర్ పూర్ణచంద్రరావు అరెస్ట్

ABN , Publish Date - Aug 26 , 2025 | 08:10 PM

సాహితీ ఇన్ ఫ్రా స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Sahiti Infra: సాహితీ స్కామ్‌లో డైరెక్టర్ పూర్ణచంద్రరావు అరెస్ట్

హైదరాబాద్, ఆగస్టు 26: సాహితీ ఇన్‌ ఫ్రా కుంభకోణంలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దూకుడు పెంచింది. ఆ క్రమంలో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావును ఈడీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ( పీఎమ్‌ఎల్‌ఏ) -2002 కింద ఆయన్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లిలోని పీఎమ్‌ఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో ఆయన్ని హాజరు పరిచారు. దీంతో సందు పూర్ణచంద్రరావుకు 15 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీ కింద రిమాండ్ విధించింది.


ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కస్టమర్లను సాహితీ ఇన్ ఫ్రా భారీగా మోసగించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఫిర్యాదులు ఆధారంగా సాహితీ ఇన్ ఫ్రా సంస్థకు చెందిన పలువరిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈ కేసును ఈడీ దర్యాప్తు చేపట్టింది. అందులోభాగంగా 700 మంది నుంచి రూ. 8 వేల కోట్ల నగదు వసూలు చేసినట్లు గుర్తించారు. అయితే ఈ వసూలు చేసిన నగదులో రూ.120 కోట్లను సాహితీ ఇన్ ఫ్రా డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు దారి మళ్లించారు.

అలాగే షెల్ కంపెనీలకు రూ. 216 కోట్లు మళ్లించగా.. హవాలా రూపంలో మరో రూ. 50 కోట్లు మళ్లించినట్లు ఈడీ అధికారులు కనుగొన్నారు. మరో వైపు ఈ దారి మళ్లించిన రూ. 216 కోట్లతో 21 ఆస్తులను సాహితీ ఇన్‌ ఫ్రా కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు కనిపట్టారు. అయితే సాహితీ కేసులో ఇప్పటి వరకు రూ. 161 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం విదితమే. అంతర్జాతీయ ప్రమాణాలు.. నాణ్యతతో విల్లాలు, ప్లాట్ల నిర్మించి ఇస్తామంటూ సాహితీ ఇన్ ఫ్రా సంస్థ భారీ మోసానికి తెర తీసినట్లు ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.

WhatsApp Image 2025-08-26 at 7.38.45 PM.jpeg

Updated Date - Aug 26 , 2025 | 08:55 PM