Vijayashanti: మోసం చేసి నా పార్టీని విలీనం చేసుకున్నారు: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Mar 13 , 2025 | 09:41 PM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఏకగ్రీవం అయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముగ్గురికీ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం వారంతా నేరుగా గాంధీ భవన్‍కు చేరుకుని మీడియా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్‍కు తాను సేవలు అందించానని, ఆ పార్టీలు సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టే వాటిని వీడినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి చెప్పారు. తన పార్టీని విలీనం చేయించుకుని మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఇవాళ (గురువారం) ఏకగ్రీవం అయ్యారు. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముగ్గురికీ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం వారంతా నేరుగా గాంధీ భవన్‍కు చేరుకుని మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి మాట్లాడుతూ.."ఎమ్మెల్సీగా బీఆర్ఎస్, బీజేపీ నేతల బండారం బయటపెడతానని భయం అవుతోందా?. నా వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందని భయపడుతున్నారా?. నా పార్టీని విలీనం చేయించుకుని నన్ను మోసం చేశారు. విజయశాంతికి, తెలంగాణకి సంబంధం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నాకు, తెలంగాణకు సంబంధం లేదా?. నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు టీడీపీలో కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి చేశా. తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంటులో లేరు. కేసీఆర్ తన దొరబుద్ధి నిరూపించుకుంటున్నారు. దొరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా?. నింద వేయడం కాదు నిరూపించాలి. నేను గట్స్ ఉన్న మహిళని. ప్రతిరోజూ నన్ను అవమానించారు.
హింసపెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు. ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం. ఏడు లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యిందో విడిచిపెట్టకుండా కేసీఆర్‍ని అడగాలి. కేసీఆర్ మోసాలన్ని బయటకి తీయాలి. ఆయన ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. తెలంగాణ వ్యతిరేకులని బీజేపీ రాష్ట్రంలో దించబోతోంది. బాంచన్ కాళ్లు మొక్కుతా అనే పరిస్థితికి మళ్లీ తెలంగాణను తీసుకెళ్లాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ వ్యతిరేకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన బీజేపీలోకి వచ్చినందుకు ఆ పార్టీని వదిలేశా. సోనియా గాంధీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది. కాపల కుక్కలాగా ఇప్పటివరకూ తెలంగాణని కాపాడుకున్నాం. ఇకపై అలాగే కాపాడుకుంటామని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..
Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..