Share News

KTR: పీఠాలు కదిలిపోతాయ్: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ వార్నింగ్

ABN , Publish Date - Nov 23 , 2025 | 09:00 PM

బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. బీసీ నేతల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

KTR: పీఠాలు కదిలిపోతాయ్: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ వార్నింగ్

హైదరాబాద్, నవంబర్ 23: స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, విపక్షాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అధికార కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. ఆ పార్టీ ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సైతం ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీలోని బీసీ నేతలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. బీసీ నేతల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ గుర్తు లేని సర్పంచి ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.


తాము తలుచుకుంటే భూకంపం సృష్టిస్తామన్నారు కేటీఆర్. బీసీలను తక్కువ అంచనా వేయకండంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను హెచ్చరించారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని.. మీ పీఠాలు కదిలిపోతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుంటే.. అవసరమైతే సర్పంచ్ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తామన్నారు. నవంబర్ 29వ తేదీన దీక్షా దివస్‌ పెద్దఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజు దీక్షా దివస్‌గా జరుపుతున్నామని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Daughter Wedding Tragedy: తీవ్ర విషాదం.. కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం..

BC Reservation Bill: బీసీ రిజర్వేషన్లపై మరో మోసానికి తెర తీసిన కాంగ్రెస్: తలసాని

Updated Date - Nov 23 , 2025 | 10:24 PM