CM Revanth Reddy: వినియోగదారుల కమిషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి మామ కేసు
ABN , Publish Date - Dec 16 , 2025 | 07:17 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. తన హెల్త్ బీమా పాలసీకి సంబంధించి క్లెయిమ్ విషయంలో కంపెనీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఈ కేసు వేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ సూదిని పద్మారెడ్డి కన్స్యూమర్స్ ఫోరంను ఆశ్రయించారు. ఆయనకు చెందిన ఆరోగ్య బీమా క్లెయిమ్ వివాదం హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ప్రస్తుతం విచారణలో ఉంది.
మే 13, 2024లో గుండెనొప్పితో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన పద్మారెడ్డి చికిత్సకు రూ.23.5 లక్షల బిల్ వచ్చింది. గత ఐదేళ్లుగా నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.20 లక్షల పాలసీకి ప్రీమియం చెల్లిస్తున్న అతను ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేశారు.
అయితే, పాలసీ తీసుకునేటప్పుడు పోస్ట్ పోలియో పెరాలసిస్ (పోలియో తర్వాతి పక్షవాతం) వ్యాధి ఉన్న విషయాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ నివాబూపా కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించింది. దీనిపై సూదిని పద్మారెడ్డి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది రాతపూర్వక వాదనలు సమర్పించారు. కంపెనీ తరఫు కౌంటర్ దాఖలు కాలేదని తెలుస్తోంది.కేసు విచారణను కమిషన్ వాయిదా వేసింది. ఈ కేసు బీమా క్లెయిమ్‌లలో ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజ్ డిస్‌క్లోజర్ నిబంధనలపై చర్చను రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి..
కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. అసలేం జరిగిందంటే..
ఈ రైతు తన భార్య కోసం వెతుక్కుంటున్నాడు.. ఎక్కడుందో కనిపెట్టండి..