CM Revanth-Birthday: సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రుల సందేశాలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 08:55 AM
సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా.. తదితర దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు రేవంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఉదయాన్నే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. రేవంత్ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని తన సందేశంలో ఆకాంక్షించారు.
అటు, సీఎం రేవంత్ రెడ్డికి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా కూడా రేవంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అటు, పలువురు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సహా దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలు, తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు, అటు, బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తమ ప్రియ నేతకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ
Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి