Share News

Baba Fasiyuddin: మాజీ డిప్యూటీ మేయర్ బాబా సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:00 PM

మాగంటి గోపీనాథ్ అనుచరులతో తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ డిప్యూటీ మేయర్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.

Baba Fasiyuddin: మాజీ డిప్యూటీ మేయర్ బాబా సంచలన వ్యాఖ్యలు
Baba Fasiyuddin

హైదరాబాద్, నవంబర్ 25: మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేట్ బాబా ఫసియుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ చనిపోయినా ఆయన అనుచరులతో తనకు ప్రాణహాని ఉందన్నారు. తనను చంపేస్తామని ఇటీవల బెదిరింపు లేఖ వచ్చిందని తెలిపారు. అజ్ఞాత వ్యక్తి లేఖపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని.. దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. తనకు తన కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలన్నారు.


వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సర్దార్ మృతిని తనపై రుద్దే ప్రయత్నం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్‌కు 50వేల మెజారిటీ వచ్చేదని.. మెజార్టీ రాకుండా అడ్డుకున్నది కొంతమంది కాంగ్రెస్‌లో ఉన్న కోవర్టులే అంటూ బాబా ఫసియుద్దీన్ బాంబు పేల్చారు.


మరోవైపు ఈరోజు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. అయితే సమావేశానికి ముందు బీఆర్‌ఎస్ నిరసనకు దిగింది. కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్ కార్పోరేటర్లు, సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సిటీలోని 9,292 ఎకరాల పరిశ్రమల భూములపై సీఎం రేవంత్ కన్ను పడిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. హిల్ట్ పీ పాలసీపై కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని బీఆర్ఎస్ నిరసనకు దిగింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్వాటర్స్ నుంచి ఫ్లకార్డ్స్ ప్రదర్శనతో జీహెచ్ఎంసీ కార్యాలయానికి బీఆర్ఎస్ కార్పోరేటర్లు చేరుకున్నారు. భూవినియోగ మార్పిడి పేరుతో దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి సర్కార్ తెరలేపిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...

కత్తులతో ఇంటి యజమానిని భయపెట్టాలని చూశాడు.. చివరకు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 12:01 PM