Share News

Vemuri Radhakrishna: సిట్ ఆఫీస్‌కు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:48 PM

Vemuri Radhakrishna: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు.

Vemuri Radhakrishna: సిట్ ఆఫీస్‌కు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ
ABN Andhra Jyothi MD Vemuri Radhakrishna

హైదరాబాద్, జూన్ 27: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ అధికారులకు (SIT Officers) ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN Andhra Jyothi MD Vemuri Radhakrishna) వాంగ్మూలం ఇచ్చారు. గంట పాటు వేమూరి రాధాకృష్ణ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. ఎస్‌ఐబీ వద్ద ఉన్న కాల్ డీటేయిల్ రికార్డ్స్‌లో వేమూరి రాధాకృష్ణ ఫోన్ నెంబర్ కూడా ఉండటంతో కేసు విచారణలో భాగంగా వాంగ్మూలం అవసరం ఉందని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి స్టేట్‌మెంట్‌ను ఇచ్చేందుకు రావాలని కోరారు.


దీంతో ఈరోజు (శుక్రవారం) ఉదయం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్‌పై సిట్‌ అధికారులకు వేమూరు రాధాకృష్ణ వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల నుంచి సిట్ అధికారులు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే 257 మంది ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలను సిట్ రికార్డు చేసింది. మరి కొంతమందివి కూడా రికార్డు చేయనున్నారు.


ఇక చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి (Chevella MP Konda Vishweshwar Reddy) కూడా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌ను చేరుకున్నారు. 2023 నవంబర్‌లో విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వాంగ్మూలం ఇచ్చేందుకు రావాల్సిందిగా ఎంపీకి సిట్ సమాచారం ఇచ్చింది. దీంతో ఈరోజు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు ఎంపీ. కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సిట్ బృందం రికార్డు చేయనుంది.


ఇవి కూడా చదవండి

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

గోల్కొండలో ఆషాఢ మాస బోనాల సందడి షురూ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 01:17 PM