Share News

Hyderabad: కొమ్మలు కొడుతుండగా ఫిట్స్‌..

ABN , Publish Date - May 23 , 2025 | 09:15 AM

చెట్ల కొమ్మలను తొలగించడానికి వచ్చిన వ్యక్తికి ఫిట్స్ రావడంతో.. ఆ కొమ్మల మధ్యే చిక్కుకుపోయిన సంఘటన నగరంలోని మల్లిఖార్జున నగర్‌లో జరిగింది. శ్రీను అనే వ్యక్తి అక్కడ ఉన్న చెట్టుపైకి ఎక్కి కొమ్మలను నరుకుతున్నాడు. ఇంతలోనే అతనికి ఫిట్స్ రావడంతో ఆ కొమ్మల మధ్యే చిక్కుకుపోయాడు.

Hyderabad: కొమ్మలు కొడుతుండగా ఫిట్స్‌..

- చెట్టుపై ఇరుక్కుపోయిన కార్మికుడు

- గమనించి తాడుతో కట్టేసిన తోటి కార్మికులు

- కాపాడిన పోలీసులు, హైడ్రా, డీఆర్‌ఎఫ్‌ బృందాలు

హైదరాబాద్: కొమ్మలను తొలగించడానికి చెట్టు ఎక్కిన వ్యక్తికి ఫిట్స్‌ రావడంతో కొమ్మల్లో చిక్కుకుపోయాడు. దాదాపు రెండు గంటలపాటు చెట్టు కొమ్మలపై ఉండడంతో గమనించిన తోటి కార్మికులు అతడు కిందపడకుండా తాడుతో కట్టేశారు. బోయినపల్లి మల్లిఖార్జునగర్‌(Boinapalli Mallikharjunagar)లో కొమ్మలను కొట్టడానికి శ్రీను అనే వ్యక్తి చెట్టు ఎక్కాడు. కొన్ని కొమ్మలను కొట్టిన తర్వాత ఫిట్స్‌ రావడంతో కొమ్మల్లో ఇరుక్కుపోయాడు.


తోటి కార్మికలు గమనించి అతడిని తాడుతో కట్టేసి బోయినపల్లి పోలీసులకు చెప్పారు. ఎస్‌ఐ శివశంకర్‌ హైడ్రా, డీఆర్‌ఎఫ్‌ బృందాలకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని అతడిని బకెట్‌ క్రేన్‌ సహాయంతో కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా రెండు గంటలపాటు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో స్థానిక ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థల వారు ఇబ్బందులు పడ్డారు.



ఈ వార్తలు కూడా చదవండి.

బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్‌, కాల్స్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 23 , 2025 | 09:15 AM