Electric buses: కొత్తగా.. మరో 65 ఎలక్ట్రిక్ బస్సులు
ABN , Publish Date - Dec 10 , 2025 | 07:58 AM
హైదరాబాద్ నగరంలో.. కొత్తగా మరో 65 ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు బుధవారం నుంచి ఆ బస్సులు రొడ్డెక్కనున్నాయి. ఇప్పటికే నగరంలో ఎలక్ట్రిక్ , డీలక్స్ బస్సులు సేవలందిస్తుండగా కొత్తగా మరో 65 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రయాణికులకు సేవలందిచనునంనాయి.
- నేడు ప్రారంభించనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు
- ఇప్పటికే 297 ఈవీ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో బుధవారం కొత్తగా 65 ఎలక్ర్టిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ డిపోలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు. గ్రేటర్‌లో రెండేళ్లలో మొత్తం 2,800 ఎలక్ర్టిక్ బస్సులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే 297 ఈవీలు
గ్రేటర్‌లో ఇప్పటికే 297 ఎలక్ర్టిక్ బస్సులను ఆర్టీసీ పలు రూట్లలో నడుపుతోంది. రాణిగంజ్ డిపోకు వచ్చిన 65 ఈవీలతో వాటి సంఖ్య 362కు చేరనుంది. జనవరి, ఫిబ్రవరి నాటికి గ్రేటర్‌కు మరో 178 ఎలక్ర్టిక్ బస్సులు వస్తాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కూకట్‌పల్లి బస్‌డిపోను ఈవీబస్ డిపోగా మార్చే దిశగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది.
డిపోల వారీగా ఈవీలు.. డిపో ఎలక్ట్రిక్ బస్సులు
హెచ్‌సీయూ 90
హయత్‌నగర్ 65
కంటోన్మెంట్ 66
మియాపూర్-2 76
రాణిగంజ్ 65
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News