Share News

Hyderabad: లోడు ఎంతయినా తట్టుకునేలా.. 1000 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు

ABN , Publish Date - Oct 14 , 2025 | 09:36 AM

విద్యుత్‌ వినియోగం ఎంత పెరిగినా తట్టుకునేలా గ్రేటర్‌లో కొత్తగా 1000 కేవీఏ(కిలో వోల్ట్స్‌ ఫర్‌ యాంప్స్‌) డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌పంపిణీ సంస్థ అందుబాటులోకి తెస్తోంది.

Hyderabad: లోడు ఎంతయినా తట్టుకునేలా.. 1000 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు

- డిమాండు పెరిగే ప్రాంతాల్లో అందుబాటులోకి..

- ఇన్‌ బిల్ట్‌ డీటీఆర్‌ల ఏర్పాటుతో ప్రమాదాల నివారణ

హైదరాబాద్‌ సిటీ: విద్యుత్‌ వినియోగం ఎంత పెరిగినా తట్టుకునేలా గ్రేటర్‌లో కొత్తగా 1000 కేవీఏ(కిలో వోల్ట్స్‌ ఫర్‌ యాంప్స్‌) డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌పంపిణీ సంస్థ అందుబాటులోకి తెస్తోంది. ప్రమాదాల నివారణకు ఇన్‌బిల్ట్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో పాటు స్విచ్‌గేర్లు ఒకే ప్రాంతంలో ఉండేలా డిస్కం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటి వల్ల ప్రమాదాలు కూడా తగ్గించుకునే అవకాశాలుంటాయని, ట్రాన్స్‌ఫార్మర్ల(Transformers) నుంచి ఆయిల్‌ లీక్‌ వంటి సమస్యలు తలెత్తవని అధికారులు చెబుతున్నారు. వేసవి డిమాండ్‌ నాటికి గ్రేటర్‌ పరిధిలోని 10 సర్కిళ్లలో 20కి పైగా వెయ్యి కేవీఏ సామర్థ్యం కల్గిన డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌లో 500 కేవీఏ సామర్థ్యం కల్గిన ట్రాన్స్‌ఫార్మర్లే పెద్దవి.


2,282 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు

గ్రేటర్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ నేపథ్యంలో 2026 జనవరి నాటికి 9 సర్కిళ్లలో 2,282 డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ నిర్ణయించింది. బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ సౌత్‌, సెంట్రల్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌, హబ్సిగూడ, రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, సైబర్‌సిటీ సర్కిళ్లలో 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 130, 160 కేవీఏ- 1709, 315 కేవీఏ - 398, 500 కేవీఏ- 45 డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచేలా సమ్మర్‌యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. 9 సర్కిళ్లలో కొత్తగా 100 కేవీఏ సామర్థ్యం కల్గిన ట్రాన్స్‌ఫార్మర్లు 1080, 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 108 ఏర్పాటు చేయనున్నారు.


city7.3.jpg

డిమాండ్‌ ఏ స్థాయిలో పెరిగినా..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏటా విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. దానికి తగ్గట్లు డిస్ర్టిబ్యూషన్‌ వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం. ఓవర్‌లోడ్‌ అవుతున్న 500 కేవీఏ డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 1000 కేవీఏ సామర్థ్యం గల వాటిని ఏర్పాటు చేస్తాం. విద్యుత్‌ డిమాండ్‌ ఏ స్థాయిలో పెరిగినా అంతరాయాలు తలెత్తకుండా, డీటీఆర్‌లపై ఓవర్‌లోడ్‌ పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం.

- ముషారఫ్‌ ఫరూఖీ, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ


ఈ వార్తలు కూడా చదవండి..

దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు

వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 14 , 2025 | 09:37 AM