Share News

RTA inspections: హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీఏ అధికారుల తనిఖీలు

ABN , Publish Date - Oct 25 , 2025 | 10:05 AM

హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ వనస్థలిపురంలో RTA అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు

RTA inspections: హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీఏ అధికారుల తనిఖీలు
RTA inspections

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ వనస్థలిపురంలో RTA అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. బండ్లగూడలో 60కి పైగా వాహనాలను తనిఖీలు చేశారు. నిబంధనలో పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా 8 బస్సులను సీజ్ చేశారు.


అటు సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌ పరిధి గగన్‌ పహాడ్‌ వద్ద సోదాలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచివస్తున్న ట్రావెల్స్‌ బస్సులను చెక్ చేశారు. వాహనాల్లోని ఫైర్‌ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. ఎల్బీ నగర్‌లోని చింతలకుంట వద్ద పలు వాహనాలను తనిఖీలు చేశారు. కాగా, కర్నూలు అగ్ని ప్రమాద ఘటన దృష్ట్యా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Bus Accident: మరో ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

Telangana Municipalities: మున్సిపాలిటీలకు భారీగా నిధులు విడుదల

Updated Date - Oct 25 , 2025 | 10:12 AM