Hyderabad: హైదరాబాద్‌లో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే...
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:46 AM
విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం మంగళవారం హైదరాబాద్ నగరంలోని నిర్ణిత ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
పంజాగుట్ట(హైదరాబాద్): బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ(ADE G.Gopi) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ స్టేట్ హోమ్, నాందారి టెంట్ హౌస్ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ ఎల్లారెడ్డిగూడ, బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రి ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ(Greenland ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ జయప్రకాష్ నగర్, పీలి దర్గా, అవంతి నగర్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలతోపాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ కార్మిక నగర్ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Read Latest Telangana News and National News