Share News

Electricity: విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఏరియాల్లో కరెంట్ కట్..

ABN , Publish Date - Sep 27 , 2025 | 07:10 AM

ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ జి. నాగేశ్వరరావు తెలిపారు. ఆజామాబాద్‌ ఈఈ, రాంనగర్‌, నల్లకుంట పరిధిలో ఉదయం 10 నుంచి 10.30 గంటలవరకు, వైఎంసిఎ పరిధిలో 11నుంచి 11.30వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

Electricity: విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఏరియాల్లో కరెంట్ కట్..

- నగరంలో.. నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలివే

హైదరాబాద్: ఆజామాబాద్‌ డివిజన్‌(Azamabad Division) పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ జి. నాగేశ్వరరావు తెలిపారు. ఆజామాబాద్‌ ఈఈ, రాంనగర్‌, నల్లకుంట పరిధిలో ఉదయం 10 నుంచి 10.30 గంటలవరకు, వైఎంసిఎ పరిధిలో 11నుంచి 11.30వరకు, పార్శిగుట్ట పరిధిలో 11 నుంచి మధ్యాహ్నం 1, ఉస్మానియా ఫీడర్‌ పరిధిలో 12నుంచి 12.30 బతుకమ్మకుంట పరిధిలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 వరకు, హర్రాజ్‌పెంట పరిధిలో 5నుంచి రాత్రి 7 గంటలవరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


కాప్రా: విద్యుత్‌ మరమ్మతుల కారణంగా జవహర్‌నగర్‌ ఫీడర్‌(Jawaharnagar Feeder) పరిధిలోని జవహర్‌నగర్‌, రాఘవేంద్రనగర్‌, కస్తూర్భానగర్‌, వసంత్‌విహార్‌ కాలనీ, కృష్ణవేణి నగర్‌, ఏపీఐఐసీ కాలనీ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు, కృష్ణానగర్‌ ఫీడర్‌ పరిధిలోని కృష్ణానగర్‌ రోడ్‌ నంబర్‌ 1, 2, మంగాపురం కాలనీ, భక్షిగూడ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మీర్‌పేట్‌ ఫీడర్‌ పరిధిలోని మీర్‌పేట్‌ తిరుమలనగర్‌, న్యూశ్రీనగర్‌ కాలనీ పరిసర ప్రాంతాలలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు మౌలాలి సబ్‌స్టేషన్‌ ఏఈ వెంకట్‌రెడ్డి తెలిపారు.


బృందావన్‌ కాలనీ ఫీడర్‌ పరిధిలో...

ఉప్పల్‌: విద్యుత్‌ లైన్‌ల మరమ్మతుల కారణంగా బృందావన్‌ కాలనీ(Brindavan Colony) ఫీడర్‌ పరిధిలోని న్యూ హేమనగర్‌, న్యూ రాంనగర్‌, శక్తి జిమ్‌ పరిసర ప్రాంతాలు, ఆదర్శ నగర్‌, కుమ్మరికుంట, వెస్ట్‌ బాలాజీ హిల్స్‌, మెక్‌-డోవల్స్‌ కాలనీ, పద్మావతీ కాలనీలలో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు బోడుప్పల్‌ సబ్‌-స్టేషన్‌ ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌ తెలిపారు. ఆంజనేయ ఫీడర్‌ పరిధిలోని ద్వారకా నగర్‌, కేశవ నగర్‌, గాయత్రీ నగర్‌, ఆంజనేయ నగర్‌, ఉదయలక్ష్మి నగర్‌లలో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు కరెంటు సరఫరా ఉండదని, వినియోగదారులు తమ సిబ్బందితో సహకరించాలని ఆయన కోరారు.


city1.2.jpg

బౌద్ధనగర్‌: విద్యుత్‌ కేబుల్‌, తదితర మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నామని విద్యానగర్‌శాఖ ఏఈ రోచిత తెలిపారు. జామై ఉస్మానియా ఫీడర్‌ పరిధిలో జామైఉస్మానియా, అంబర్‌నగర్‌, లలితానగర్‌, పార్ట్‌ ఆఫ్‌ అడిక్‌మెట్‌ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..

ట్రిపుల్‌ ఆర్‌ బాధితుల ఆరోపణలు నిజమే

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2025 | 07:10 AM