Share News

Indiramma Canteens: ఇందిరమ్మ క్యాంటీన్లకు వచ్చి వెనుతిరిగిన పేదలు

ABN , Publish Date - Oct 01 , 2025 | 09:46 AM

తొలి రోజున నోరూరించే అల్పాహారాలను రుచి చూపించిన ఇందిరమ్మ క్యాంటీన్లు రెండో రోజు ఒక అల్పాహారం మాత్రమే అందించారు. అదీ కేవలం 150 మందికి వడ్డించి మూసేశారు. దీంతో ఉదయం 9 గంటలలోపే వచ్చిన అల్పాహారం అయిపోవడంతో చాలామంది పేదలు తిరిగి వెళ్లిపోవడం కనిపించింది.

Indiramma Canteens: ఇందిరమ్మ క్యాంటీన్లకు వచ్చి వెనుతిరిగిన పేదలు

హైదరాబాద్: తొలి రోజున నోరూరించే అల్పాహారాలను రుచి చూపించిన ఇందిరమ్మ క్యాంటీన్లు(Indiramma Canteens) రెండో రోజు ఒక అల్పాహారం మాత్రమే అందించారు. అదీ కేవలం 150 మందికి వడ్డించి మూసేశారు. దీంతో ఉదయం 9 గంటలలోపే వచ్చిన అల్పాహారం అయిపోవడంతో చాలామంది పేదలు తిరిగి వెళ్లిపోవడం కనిపించింది. మోతినగర్‌, ఖైరతాబాద్‌ మింట్‌కాంపౌండ్‌(Motinagar, Khairatabad Mint Compound)లలో ఇదే పరిస్థితి కనిపించింది.


city6.2.jpg

ఈ రెండు కేంద్రాల వద్ద ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం చేసిన వారిని పలుకరించగా, కనీసం రెండు అల్పాహారాలు, మధ్యాహ్నం భోజనంలో మరో కర్రీ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అధికారులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !

Read Latest Telangana News and National News

Updated Date - Oct 01 , 2025 | 09:46 AM