Hyderabad: జీవితాన్ని ప్రేమిద్దాం.. ఆత్మహత్యలను నివారిద్దాం
ABN , Publish Date - Sep 10 , 2025 | 08:45 AM
జీవితాన్ని ప్రేమిద్దాం.. 2ఆత్మహత్యలను నివారిద్దాం, జీవితం ఒక గొప్ప వరం.. జీవించడం ఒక గొప్ప కళ అనే నినాదాలతో రోష్నీ(స్వచ్ఛంధ సంస్థ) ఇరవై ఎనిమిదేళ్లుగా తనవంతు కృషి చేస్తుంది. ఈ సంస్థ ఇప్పటివరకు వేలాది మందిని ఆత్మహత్యల నుంచి కాపాడింది.
- నేడు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
హైదరాబాద్: జీవితాన్ని ప్రేమిద్దాం.. 2ఆత్మహత్యలను నివారిద్దాం, జీవితం ఒక గొప్ప వరం.. జీవించడం ఒక గొప్ప కళ అనే నినాదాలతో రోష్నీ(స్వచ్ఛంధ సంస్థ) ఇరవై ఎనిమిదేళ్లుగా తనవంతు కృషి చేస్తుంది. ఈ సంస్థ ఇప్పటివరకు వేలాది మందిని ఆత్మహత్యల నుంచి కాపాడింది.
కారణాలు
ఓ మనిషి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడంలో అనేక కారణాలు ఉంటాయి. అందులో మొదటిది మానసిక ఒత్తిడి. దీనితో పాటు ఒంటరితనం, వృద్ధాప్యం, కుటుంబ, ఆర్థిక సమస్యలు, అభధ్రతాభావం, అనారోగ్య కారణాలు, దీర్ఘకాలిక రోగాలు, మానసిక సమస్యలు, వరకట్న వేధింపులు, గృహహింస, వివాహేతర సంబంధాలు, లైంగిక వేధింపులు, ఆత్మీయులు చనిపోయిన బాధలు, చదువు, ఉద్యోగ పరమైన ఒత్తిడులతో ఆత్మహత్యలకు ప్రయత్నిస్తుంటారు.
లక్షణాలు
ఎవ్వరినీ లెక్క చేయకపోవడం, ఒంటరిగా ఆలోచనల్లో ఉండడం, తీవ్ర నిరాశ, నిస్పృహ, ప్రతి చిన్న విషయానికి పెద్దగా స్పందించడం, తమపై తమకు విరక్తివంటి లక్షణాలు కనిపిస్తాయి.
వారికి కావాల్సింది
కాస్తంత ఓదార్పు, మానసిక ఆసరా, నీకు నేను ఉన్నాను అనే భరోసా, వారి బాధలను ఓపికగా విని వారినే దానికి పరిష్కారం కనుగొనేలా చేయడం. 2020 ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది బలవన్మరణాలు జరుగుతున్నాయి. అందులో అధిక శాతం 15 నుంచి 29 ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. అదే భారతదేశంలో రోజుకు 381 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందులో మహారాష్ట్ర 13.60 శాతంతో మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 5.5శాతంతో ఆరో స్థానంలో ఉంది.
ఆత్మహత్య లేని సమాజమే లక్ష్యం
ఆత్మహత్య లేని సమాజమే లక్ష్యంగా రోష్నీ స్వచ్ఛంధ సంస్థ పనిచేస్తుంది. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని, ఓదార్పును అందించి వారి బాధను పంచుకుంటూ వారికి వారి భవిష్యత్తుపై ఆశను చిగురింప చేసి ఆత్మహత్య ఆలోచన నుంచి దృష్టి మరల్చి బతుకుపై ఆశను నింపుతూ సేవలను అందిస్తున్నాం.
విద్యారెడ్డి, రోష్నీ వాలంటీర్
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News