Hyderabad: మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపోలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:28 AM
హైదరాబాద్ మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపోలో ఇవాళ (శనివారం) అగ్ని ప్రమాదం జరిగింది. కస్టమ్స్ క్లియర్ కాని లిక్కర్‌ను కస్టమ్స్ అధికారులు గోడౌన్‌లో భద్ర పరిచారు. లిక్కర్ భద్రపరిచిన గోడౌన్‌లోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 25: హైదరాబాద్ మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపోలో ఇవాళ (శనివారం) అగ్ని ప్రమాదం జరిగింది. కస్టమ్స్ క్లియర్ కాని లిక్కర్‌ను కస్టమ్స్ అధికారులు గోడౌన్‌లో భద్ర పరిచారు. లిక్కర్ భద్రపరిచిన గోడౌన్‌లోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉదయం 9 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు..ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు. ఈ అగ్నిప్రమాదంలో లిక్కర్ బాటిళ్లు, ఇతర మెటీరియల్స్ కాలి బూడిద అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అక్కడివారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Telangana Congress: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపికపై ఏఐసీసీ కసరత్తు
HYDRA: రూ.30 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా