Hyderabad: మార్కెట్‌లో మధుర ఫలాలు.. కిలో రూ.100కి పైగానే
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:15 AM
మార్కెట్‌లో సీతాఫలాలు సందడి చేస్తున్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు నల్గొండ, వికారాబాద్, మెదక్ ప్రాంతాల అడవుల నుంచి తెప్పించి విక్రయిస్తున్నారు. చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై కొందరు రోడ్ల పక్కన, రైతు బజ్లాలో ఇంకొందరు గంపల్లో పెట్టి విక్రయిస్తున్నారు.
- సీతాఫలంలో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువే అంటున్న వైద్యులు
హైదరాబాద్: మార్కెట్‌లో సీతాఫలాలు సందడి చేస్తున్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు నల్గొండ, వికారాబాద్, మెదక్(Nalgonda, Vikarabad, Medak) ప్రాంతాల అడవుల నుంచి తెప్పించి విక్రయిస్తున్నారు. చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై కొందరు రోడ్ల పక్కన, రైతు బజ్లాలో ఇంకొందరు గంపల్లో పెట్టి విక్రయిస్తున్నారు. కిలో రూ.90 నుంచి 150 వరకు లేదా ఒక్కో కాయ రూ.15 నుంచి రూ.20 చొప్పున అమ్ముతున్నారు. కొందరు మగ్గిన పండ్లు, మరికొందరు పక్వానికి రాని కాయలను విక్రయిస్తున్నారు.

ఎన్నో పోషకాలు..
సీతాఫలంలో ఎన్నో పోషకాలు ఔషధగుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడే విటమిన్ సి, న్యూరోట్రాన్స్ మీటర్‌కు సహాయపడే విటమిన్ బీ6 అధికంగా ఉంటుందని వారు అంటున్నారు. కెరిటినాయిడ్లు, ప్లెవనాయిడ్లు శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కల్గి ఉంటుందని ఇది రక్తపోటును నియంత్రిస్తుందని తెలియజేస్తున్నారు. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణక్రియను మెరుగు పరచడం.. కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు సలహాఇస్తున్నారు. ఇందులోని విటమిన్ ఏ దృష్టిని మెరుగు పరచడంలో దోహద పడుతుంది. దీనిలోని బీ6 విటమిన్ మెదడు పని తీరును మెరుగు పరుస్తుందని వారు సూచిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News