Hyderabad: ఖరీదైన కల్చరల్ సెంటర్‌లో పేకాట దందా
ABN , Publish Date - Sep 09 , 2025 | 07:07 AM
నగరంలో అదో ఖరీదైన ప్రాంతం. సంపన్నులు, సెలబ్రిటీలు, నేతలు ఎక్కువగా అక్కడే నివసిస్తుంటారు. వారంతా కలిసి ఓ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తొలుత కాలనీకి చెందిన వారినే సభ్యులుగా ఏర్పాటు చేసినా.. తర్వాతి కాలంలో బయట వాళ్లకు కూడా సభ్యత్వాన్ని ఇవ్వటం మొదలైంది.
- తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి వాలిపోతున్న సంపన్నులు, నేతలు
- గెస్టుల పేరుతో వచ్చి రూ.లక్షల్లో జూదం
- మహిళలకు దక్కని మర్యాద
- ఇబ్బందుల్లో కాలనీవాసులు
హైదరాబాద్‌సిటీ: నగరంలో అదో ఖరీదైన ప్రాంతం. సంపన్నులు, సెలబ్రిటీలు, నేతలు ఎక్కువగా అక్కడే నివసిస్తుంటారు. వారంతా కలిసి ఓ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తొలుత కాలనీకి చెందిన వారినే సభ్యులుగా ఏర్పాటు చేసినా.. తర్వాతి కాలంలో బయట వాళ్లకు కూడా సభ్యత్వాన్ని ఇవ్వటం మొదలైంది. నెలకు రూ.లక్ష చొప్పున పదకొండు నెలలు కట్టాలన్న షరతు విధించారు. అయినా పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు.
ఆ కల్చరల్ సెంటర్ ప్రస్తుతం పేకాట ఆడే వారి కోసమే అన్నట్లుగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీకి చెందిన ఇద్దరు నేతల కనుసన్నల్లో ఈ పేకాట వ్యవహారం సాగుతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో రూ.5 లక్షలు పెట్టి ఆడేస్తున్నట్లుగా తెలుస్తోంది. కల్చరల్ సెంటర్ మొదలైనప్పుడు అంతా పద్దతిగా సాగినప్పటికీ.. పేకాట వ్యవహారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత పరిస్థితులు దారుణంగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. అక్కడికి వచ్చేందుకు కుటుంబాలు.. మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది.

వారాంతాల్లో సరదాగా..
ఆధునిక హంగులతో కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కాలనీవాసులంతా కుటుంబ సభ్యులతో కలిసి వారాంతాల్లో ఇతర ఈవెంట్స్ సమయంలో అక్కడికి వెళ్తుంటారు. అలాంటి అందమైన, ఆహ్లాదకరమైన కల్చరల్ సెంటర్‌ను బ్రష్టు పట్టించారన్న విమర్శలు వస్తున్నాయి. పేకాట శిబిరాలను నిర్వహిస్తూ.. బెట్టింగ్ దందాను కొనసాగిస్తూ నిర్వాహకులు రూ.కోట్లు గడిస్తున్నట్లు తెలుస్తోంది. గెస్టుల పేరుతో పదుల సంఖ్యలో వచ్చి అక్కడ తిష్టవేస్తున్న పెద్దలు, పేకాటరాయళ్లు.. కల్చరల్ సెంటర్‌ను పేకాటకు అడ్డాగా మార్చడంపై కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ
Read Latest Telangana News and National News