Jubilee Hills by-election: విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు.. సునీత నామినేషన్ ఆమోదం పొందితే ఉపసంహరణ
ABN , Publish Date - Oct 19 , 2025 | 10:04 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను పీవీఆర్ అందజేశారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 19: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను పీవీఆర్ అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విష్ణుతో నామినేషన్ వేయించామని బీఆర్ఎస్ చెబుతోంది. మాగంటి సునీత నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తరువాత విష్ణువర్థన్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని సమాచారం. బైపోల్ లో బరిలో నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఇప్పటికే (అక్టోబర్ 15) నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక ఖరారైంది.ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు, బైపోల్ నిర్వహణకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. అటు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాయి. బీఆర్ఎస్ తరఫున గోపీనాథ్ భార్య మాగంటి సునీతను గులాబీ పార్టీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఇక బీజేపీ పార్టీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఉపఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. అటు జూబ్లీహిల్స్ లోని డివిజన్లలో అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందనేదానిపై రోజురోజుకి ఉత్కంఠ పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
BC Bandh Success: బీసీ బంద్ సక్సెస్!
Bullet: బాలుడి వద్ద బుల్లెట్.. రంగంలోకి దిగిన పోలీసులు