Share News

Hyderabad: భానుడి భగ.. మీటరు గిరా..

ABN , Publish Date - Apr 26 , 2025 | 07:43 AM

గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా రికార్డుస్థాయిలో పెరిగింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 90 ఎంయూలకు విద్యుత్‌ వినియోగం చేరింది. ఇదిలా ఉంటే.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Hyderabad: భానుడి భగ.. మీటరు గిరా..

- గ్రేటర్‌లో 90 ఎంయూలకు చేరిన విద్యుత్‌ వినియోగం

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో భానుడి భగభగలకు విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగిస్తుండటంతో డిమాండ్‌ పెరిగింది. గురువారం గ్రేటర్‌లో 89.57 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ వినియోగం నమోదైంది. మే నెలలో విద్యుత్‌ వినియోగం 100 మిలియన్‌ యూనిట్లకు చేరే అవకాశముంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఆపరేషన్‌ వింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా


city2.jpg

గరిష్ఠ ఉష్ణోగ్రతలు..

ఉదయం 9 గంటల నుంచే భానుడు నిప్పులు గక్కుతున్నాడు. మాదాపూర్‌, మెహిదీపట్నం, లంగర్‌హౌస్‌(Madhapur, Mehidipatnam, Langar House) ప్రాంతాల్లో శుక్రవారం 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌, న్యూ మెట్టుగూడ, మలక్‌పేట ప్రాంతాల్లో 41.8 డిగ్రీలు, గోషామహల్‌, ముషీరాబాద్‌, గాజులరామారాం(Musheerabad, Gajularamaram) ప్రాంతాల్లో 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా

మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..

బూడిద గుమ్మడితో భలే భలేగా

రజతోత్సవ వేళ రగిలే ప్రశ్నలు

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2025 | 07:43 AM