CM Revanth Reddy: అసౌకర్యం కలగొద్దు
ABN , Publish Date - Apr 30 , 2025 | 03:51 AM
మిస్ వరల్డ్ 2025 పోటీల కోనం హైదరాబాద్‌కు వచ్చే పోటీదారులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మిస్ వరల్డ్‌కు వచ్చే పోటీదారులు, అతిథులకు
ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చెయ్యండి
ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
మే 2న 224 మంది ఏఈలకు నియామక పత్రాలు
హైదరాబాద్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): మిస్ వరల్డ్ 2025 పోటీల కోనం హైదరాబాద్‌కు వచ్చే పోటీదారులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోటీదారులు, అతిథులు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కట్టుదిటమైన భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విమానాశ్రయం, హోటళ్లు, పోటీలు జరిగే ప్రాంతాల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మే నెలలో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి.. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారం ఉన్నస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే అతిథులకు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను అతిథులు సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. మిస్‌వరల్డ్ పోటీల నేపథ్యంలో చేపట్టిన సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోటీలు ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్థం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జయేశ్ రంజన్, పర్యాటక శాఖ డైరెక్టర్ హన్మంతు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, డీజీపీ జితేందర్, ఏడీజీపీ మహే్‌షభగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News