Share News

ఆదివారం వస్తే చాలు.. ఇక ఆ ఏరియాలో..

ABN , Publish Date - May 24 , 2025 | 10:21 AM

ఆదివారం వస్తే చాలు.. ఇక ఆ ఏరియా మొత్తం సందడిగా ఉందడిగా ఉంటుంది. సందడంటే ఏదో శుభకార్యమనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే అక్కడ జరిగేది ఏ శుభకార్యంకాదు.. కేవలం పేకాట. ఇందుకోసం బడాబాబులు వాహనాలపై వస్తుంటారు. ఇక వివరాల్లోకి వెళితే..

ఆదివారం వస్తే చాలు.. ఇక ఆ ఏరియాలో..

- జోరుగా పేకాట క్లబ్బులు!

- ఆదివారం వస్తే పేకాటరాయుళ్ల కోలాహలం

- చేతులు మారుతున్న లక్షల రూపాయలు

- పట్టించుకోని పోలీసులు

హైదరాబాద్: ఆదివారం వస్తే అక్కడ పేకాట రాయుళ్ల కోలాహలం నెలకొంటుంది. ఒక పక్క డీసీపీ కార్యాలయం, మరోపక్క ఎస్‌ఓటీ, సీసీఎస్‌ కార్యాలయాలు.. కూతవేటు దూరంలో జీడి మెట్ల పోలీస్‌స్టేషన్‌ ఉన్నా.. ఎలాంటి భయం లేకుండా వీరు పేకాటాడుతున్నారు. నిత్యం పహారాలో నిర్వహిస్తున్న ఈపేకాట శిబిరా లకు కొందరు స్థానిక అధికారులు, సిబ్బంది అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పేకాట క్లబ్బులో లక్షల రూపాయలు చేతులు మారుతున్నా యని తెలిసింది.


నిర్మానుష్య ప్రాంతంలో..

ఇదెక్కడో నగర శివారులో కాదు.. కుత్బు ల్లాపూర్‌లోని హెచ్‌ఎంటీ జంగల్‌లో ఈ పేకాట క్లబ్బులను నిర్వహిస్తున్నారు. ఒకప్పు డు జనంతో కళకళలాడిన హెచ్‌ఎంటీ కంపెనీ మూతపడిన తర్వాత ఆ కంపెనీ కాలనీలో జనసంచారం తగ్గిపోయింది. ప్రస్తు తం ఈ ప్రాంతంలో చెట్లు పెరిగిపోయి అడ విని తలపిస్తోంది. దీనిని ఆసరా చేసుకొని ఈపేకాట రాయుళ్లు హెచ్‌ఎంటీ ప్రాంతం లోని వెంకటేశ్వరస్వామి ఆలయం, చర్చి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దర్జాగా పేకాట స్ధావరాలను నిర్వహిస్తున్నారని స్థాని కులు తెలిపారు.


కూతవేటు దూరంలోనే పోలీసు కార్యాలయాలు

పోలీస్‌ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఈ దందా కొనసాగుతున్నా ఉన్న తాధికారుల దృష్టికి రాకపోవడం విడ్డూరంగా ఉంది. ఉన్నతాధికారులకు తెలిసే ఈ దందా జరుగుతుందనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజ కవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ పే కాట క్లబ్బులు జోరుగా సాగుతున్నాయి. గ తంలో షాపూర్‌నగర్‌లోని ఓ ప్రముఖ హాట ల్‌లో పేకాటాడుతుండగా పోలీసులు దాడి చేయగా పెద్దఎత్తున డబ్బు దొరికినా పోలీ సులు ఆ విషయం బయటకు రాకుండా నొక్కిపెట్టినట్టు తెలుస్తోంది.


- గాజులరామారం, ఎస్‌ఆర్‌ నాయక్‌ నగర్‌, బాలాజీలేఅవుట్‌, రామిరెడ్డినగర్‌, సూరారంకాలనీ, విశ్వకర్మ కాలనీ, చింతల్‌, షాపూర్‌నగర్‌ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో కూడా పేకాట శిబిరాలు నడుస్తున్నాయని స్ధానికులు చెప్తున్నారు. అదే విధంగా షాపూ ర్‌నగర్‌, జీడిమెట్ల, చింతల్‌, సుచిత్ర ప్రాంతా ల్లోని హాటళ్లు, లాడ్జీల్లోనూ పేకాట జోరుగా సాగుతోందని తెలిసింది. అన్నీ తెలిసి కూడా సంబంధిత అధికారులు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఇప్పటికైనా సైబరాబాద్‌ కమిషనర్‌ స్ధాయి అధికారి కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో సాగుతున్న పేకాట స్ధావరాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..

Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!

Read Latest Telangana News and National News

Updated Date - May 24 , 2025 | 11:14 AM