Share News

Hyderabad: 9999 నంబర్‌కు రూ.22.72 లక్షలు

ABN , Publish Date - Nov 15 , 2025 | 09:11 AM

ఫ్యాన్సీ నంబర్ల ఆన్‌లైన్‌ వేలంలో రవాణా శాఖకు రూ.65.38 లక్షల ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్‌ ఆర్‌టీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో టీజీ 09 హెచ్‌ 9999 నంబర్‌ను రికార్డు స్థాయిలో రూ.22,72,222లకు హానర్‌ ప్రైమ్‌ హౌసింగ్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ దక్కించుకుంది.

Hyderabad: 9999 నంబర్‌కు రూ.22.72 లక్షలు

- రికార్డు స్థాయి ధర

హైదరాబాద్‌ సిటీ: ఫ్యాన్సీ నంబర్ల ఆన్‌లైన్‌ వేలంలో రవాణా శాఖకు రూ.65.38 లక్షల ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్‌ ఆర్‌టీఏ కార్యాలయం(Khairatabad RTA Office)లో శుక్రవారం నిర్వహించిన వేలంలో టీజీ 09 హెచ్‌ 9999 నంబర్‌ను రికార్డు స్థాయిలో రూ.22,72,222లకు హానర్‌ ప్రైమ్‌ హౌసింగ్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ దక్కించుకుంది. టీజీ 09 జే 0009 నెంబర్‌ను దండు ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.6.80 లక్షలకు, టీజీ 09 జే 0006 నెంబర్‌ను సాయి సిల్క్స్‌ కళామందిర్‌ లిమిటెడ్‌ రూ.5.70 లక్షలకు దక్కించుకున్నాయి.


city5.2.jpg

టీజీ 09 జే 0099 నంబర్‌ను గోదావరి ఫార్చూన్‌ రూ.3.40 లక్షలకు, టీజీ 09, జే 0001ను శ్రీనిధి ఐటీ స్పేసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2.60 లక్షలకు, టీజీ 09 జే 0005 నెంబర్‌ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ రూ.2.40 లక్షలకు వేలంలో దక్కించుకున్నాయి. మరి కొన్ని నెంబర్లనూ రూ.1.15 లక్షల నుంచి రూ.1.71 లక్షలకు పలు సంస్థలు కొనుగోలు చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2025 | 09:11 AM