CP VC Sajjanar: సమాజ సేవలో పోలీసులు ముందుంటారు..
ABN , Publish Date - Oct 02 , 2025 | 11:04 AM
కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయడంలో కూడా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.
- సీపీ వీసీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ: కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయడంలో కూడా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్(Hyderabad CP VC Sajjanar) తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని కమిషనరేట్‌లో బుధవారం వికలాంగుల నెట్‌వర్క్, ఫ్రీడం అసోసియేషన్, ట్రిపుల్ ఆర్ ఫౌండేషన్, ఎన్‌ఏఎంసీ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీపీ దివ్యాంగులకు వీల్‌చైర్‌లు పంపిణీ చేశారు.

సమాజంలోని నిస్సహాయులకు, ముఖ్యంగా దివ్యాంగులకు అండగా నిలవడం మనందరి బాధ్యత అన్నారు. దివ్యాంగులకు వీల్ చైర్‌లు పంపిణీ చేసిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ క్రైం తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ అపూర్వారావు, దివ్యాంగుల సంఘాల నాయకుడు ఎం. శ్రీనివాసులు, న్యాయవాది రాపోలు భాస్కర్, డాక్టర్ విజయభాస్కర్, టీవీ నటుడు లోహిత్‌కుమార్, పీడబ్ల్యూఏ ట్రస్ట్ సభ్యుడు చిదం శ్రీనివాస్, ఎన్‌ఏఎంసీ ట్రస్ట్ సభ్యులు సామ్రాజ్యలక్ష్మి, కిరణ్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
Read Latest Telangana News and National News