Domestic Dispute: కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:41 AM
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ దంపతుల జీవితం లో ఆన్‌లైన్ బెట్టింగులు చిచ్చురేపాయి. బెట్టింగులకు బానిసైన భర్త ఆ కారణంగా అప్పులపాలయ్యాడు. భార్య వద్దని మందలించడంతో కుటుంబంలో..
ప్రేమించి పెళ్లాడిన భార్యను హత్య చేసిన భర్త
బెట్టింగులతో అప్పుల పాలవడంతో కలహాలు
బూర్గంపాడు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ దంపతుల జీవితం లో ఆన్‌లైన్ బెట్టింగులు చిచ్చురేపాయి. బెట్టింగులకు బానిసైన భర్త ఆ కారణంగా అప్పులపాలయ్యాడు. భార్య వద్దని మందలించడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. చివరకు కట్టుకున్న భర్తే ఆమెను హత్య చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చెందిన ఎస్‌కే షంషీర్‌పాషా అలియాస్ ఛోటే బాబా, మహమూదా(32) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతా నం. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ఛోటే బాబా డబ్బుపై అత్యాశకు పోయి బెట్టింగులకు అలవాటు పడ్డాడు. ఆర్థికంగా నష్టపోయాడు. మళ్లీ అందులోనే డబ్బు లు సంపాదించాలని అప్పులు చేసి మరీ బెట్టింగులు పెట్టాడు. కొంత కాలం నుంచి ఏ పనీ చేయకుండా ఇంటి దగ్గరే ఉంటూ వృథా ఖర్చు లు చేస్తున్నాడు. దాంతో భార్య మహమూదా అతడిని మందలించింది. అదే సమయంలో అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుంచి ఛోటే బాబాపై ఒత్తిడి పెరిగింది. రోజువారీ ఖర్చులకు డబ్బుల్లేని పరిస్థితి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి. ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి గొడవ జరుగగా కోపోద్రిక్తుడైన ఛోటే బాబా.. మహమూదా గొంతు నులిమి చంపేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News