Share News

Weather Report: ఇవాళ, రేపు తెలంగాణలో.. ఈ వారమంతా దేశవ్యాప్తంగా కుండపోత

ABN , Publish Date - Jul 22 , 2025 | 09:10 PM

ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వారమంతా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కుండపోత వాన పడే అవకాశం ఉందని చెప్పింది.

Weather Report: ఇవాళ, రేపు తెలంగాణలో.. ఈ వారమంతా దేశవ్యాప్తంగా కుండపోత
Weather Report

వెదర్ రిపోర్ట్, జులై 22: రాబోయే వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా ఆంధ్ర, కేరళ, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో రాబోయే వారం రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాక, బలమైన ఉపరితల గాలులు (గంటకు 40-50 కి.మీ వేగంతో) వీచే అవకాశం ఉందని చెప్పింది.

జూలై 24 - 27 తేదీల్లో దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలలో (పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జూలై 22 - 28 తేదీల్లో కేరళ, మహే, కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది.

జూలై 22 - 26 తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. జూలై 22 - 26 తేదీల్లో కోస్తా కర్ణాటకలో, జూలై 25 - 27 తేదీల్లో కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


పశ్చిమ భారతదేశం:

జూలై 22, 28 తేదీల్లో కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. 22, 26 తేదీల్లో మరాఠావాడలో భారీ వర్షాలు, జూలై 22, 26-28 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో వర్షాలు పడతాయి.

తూర్పు, మధ్య భారతదేశం:

జూలై 22, 28 తేదీల్లో మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30-40 కి.మీ. వేగంతో) కురిసే అవకాశం ఉంది.

వాయువ్య భారతదేశం:

22-24 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లో వర్షాలు కురుస్తాయి. 22వ తేదీతోపాటు, 26-28 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, 22-28 తేదీల్లో ఉత్తరాఖండ్, 22, 23, 27, 28 తేదీల్లో పంజాబ్, హర్యానా, 25-28 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 27, 28 తేదీలలో పశ్చిమ రాజస్థాన్, 23 తేదీన తూర్పు రాజస్థాన్, జూలై 26-28 తేదీలలో జమ్మూ-కాశ్మీర్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.

ఈశాన్య భారతదేశం:

ఈశాన్య భారతదేశంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాబోయే 7 రోజుల్లో ఉరుములతో కూడిన మెరుపులు కొనసాగే అవకాశం ఉంది.

జూలై 22 - 28 తేదీలలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 23న మేఘాలయలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 09:49 PM